Star Heroine: సినిమాల్లో ఒకప్పుడు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకునేవి. స్టార్ హీరోలకు చెల్లి గా, కూతురిగా నటించిన ఎంతో మంది హీరోయిన్లు, పెరిగి పెద్దయ్యాక అదే స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించి రొమాన్స్ చేసేవారు. అలాంటి హీరోయిన్స్ జాబితా తీస్తే శ్రీదేవి మొదటి స్థానం లో ఉంటుంది. అప్పట్లో ఈమె కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో బాలనటిగా, వాళ్లకు కూతురు పాత్రల్లో నటించింది. మళ్ళీ ఈమె పెరిగి పెద్దయ్యాక ఆ స్టార్ హీరోల సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్. శ్రీదేవి(Sridevi) తో ఎన్టీఆర్ కలిసి చిందులు వేయడం, రొమాన్స్ చేయడం వంటివి అప్పట్లో ఆయన కుటుంబం లో విభేదాలకు కూడా దారి తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా శ్రీదేవి ఇలాగే చేసింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
అయితే ఇది ఆమె వెండితెర కి మాత్రమే పరిమితం చేయలేదు, నిజ జీవితం లో కూడా ఆమెకు యాదృచ్చికంగా అలాంటిదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీదేవి బోణీ కపూర్(Boney Kapoor) ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటికే బోణీ కపూర్ కి మోనా సౌరీ అనే అమ్మాయితో వివాహం జరిగిపోయింది. ఆమెని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా బోణీ కపూర్ శ్రీదేవి ని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. ఈ కారణం చేత అప్పట్లో చాలా వివాదాస్పద సంఘటనలే జరిగాయి. శ్రీదేవి కారణంగా బోణీ కపూర్ కాపురం చెడిపోతుంది అనే ఉద్దేశ్యంతో అప్పట్లో బోణీ కపూర్ తల్లి నిర్మల కపూర్ శ్రీదేవి ని ఇంటికి పిలిపించి బోణీ కపూర్ చేతికి రాఖీ కట్టించిందట. ఈ విషయాన్ని స్వయంగా బోణీ కపూర్ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.
అయినప్పటికీ కూడా బోణీ కపూర్ శ్రీదేవి ని ప్రేమించడం ఆపలేదు. ఆమె వెంట పడ్డాడు, చివరికి ఆమె ప్రేమని దక్కించుకొని పెళ్లి చేసుకున్నాడు. కానీ బోణీ కపూర్ తల్లి నిర్మల కపూర్ మాత్రం వీళ్ళ పెళ్లిని అంగీకరించలేదు. ఒక ఈవెంట్ లో శ్రీదేవి ని ఆమె చెప్పుతో కొట్టిన సందర్భం కూడా ఉందట. ఇలా చాలానే అప్పట్లో జరిగాయి. ఇకపోతే ఈ దంపతులిద్దరికీ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పుట్టారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కానీ, టాలీవుడ్ లో మాత్రం ఈమెకు ‘దేవర’ బ్లాక్ బస్టర్ ద్వారా గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది చిత్రం చేస్తుంది. ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది.