Star Heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకటి హీరో జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన జేడీ చక్రవర్తి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాతో జేడి చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన శివ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో జెడి చక్రవర్తి లైఫ్ మారిపోయింది. తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా ఈయనకు అవకాశాలు క్యూ కట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని జెడి చక్రవర్తి హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా పలు సినిమాలలో అద్భుతంగా నటించారు. ఇక శివ సినిమా తర్వాత తెలుగులో మనీ మనీ, వన్ బై టు, గులాబీ వంటి సినిమాలలో హీరోగా అలరించారు. ఈ క్రమంలోనే తెలుగుతోపాటు హిందీలో రిలీజ్ అయిన సత్య అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం అందుకుంది. ఈయన నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా పలు సినిమాలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి తనకి ఒక స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ వచ్చినట్టు తెలిపారు. ఆ హీరోయిన్ అప్పట్లో పాన్ ఇండియా స్టార్. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార శ్రీదేవి. ఒక సందర్భంలో హీరో జెడి చక్రవర్తి హీరోయిన్ మహేశ్వరి ఇంటికి వెళ్లారట. శ్రీదేవి మరియు మహేశ్వరి దగ్గరి బంధువులు అవుతారు. జెడి చక్రవర్తి మహేశ్వరి ఇంటికి వెళ్లినప్పుడు శ్రీదేవి తల్లి ఆ ఇంట్లో ఉన్నారట.
అక్కడికి జేడీ చక్రవర్తి వెళ్ళగానే శ్రీదేవి తల్లి అక్కడికి వచ్చి తనతో కాసేపు మాట్లాడి మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని ప్రపోజల్ పెట్టారట. అప్పుడు ఆయన షాక్ అయ్యారట. అయితే అప్పటికి శ్రీదేవికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఆయనకు తెలిసిందట. దీంతో కాసేపు సైలెంట్ అయినా జెడి చక్రవర్తి ఆమెకు సమాధానం ఇవ్వలేదట. ఈ విధంగా హీరోయిన్ శ్రీదేవి నీ పెళ్లి చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇంటర్వ్యూ లో జెడి చక్రవర్తి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు అవుతుంది. అయితే అప్పట్లో జేడీ చక్రవర్తికి హీరోయిన్ మహేశ్వరి కి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉందని కొన్ని వార్తలు కూడా వినిపించేవి. ఇది ఇలా ఉంటె జెడి చక్రవర్తి తెలుగు లో మృగం,దెయ్యం,బొంబాయి ప్రియుడు,ఎగిరే పావురమా వంటి పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.ఈయన తెలుగుతో పాటు తమిళ్,హిందీ లో కూడా పలు సినిమాలలో నటించారు.అలాగే 2023 లో రిలీజ్ అయిన దయా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు.