Hari Hara Veera Mallu Nizam Area Rights: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం పై గత నెల రోజుల నుండి సోషల్ మీడియా లో జరిగిన నెగెటివ్ ప్రచారం ఎలాంటిదో మనమంతా చూసాము. అప్పటికే అభిమానుల్లో ఈ సినిమాని మేకర్స్ సరిగా ప్రమోట్ చేయడం లేదనే కోపం, అసంతృప్తి, నిరసన భావాలు ఉన్నాయి. ఇంకో పది రోజుల్లో విడుదలకు రెడీ అయిన సినిమా అకస్మాత్తుగా వాయిదా పడింది. అప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. అలాంటి సమయం లో వాయిదా అంటే అభిమానుల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పుండు మీద కారం చల్లినట్టు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అంటే పడని కొన్ని వెబ్ సైట్స్ ‘హరి హర వీరమల్లు’ కి బయ్యర్స్ లేరు అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. బయట కూడా ఈ ప్రచారం బాగా వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు నిస్సహాయత తో ఏమి చెయ్యలేని పరిస్థితి.
Also Read: ఒక్క ఓవర్ లో 23 పరుగులా? ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేసిన వారికి దండం పెట్టాలి!
పవన్ కళ్యాణ్ సినిమాకు బయ్యర్స్ లేకపోవడం ఏంటి?, రీమేక్ సినిమాలకే వందల కోట్ల బిజినెస్ లు పెట్టినోడు, ప్రచారం చేసేవారికయినా ఉండాలి కదా అని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు కూడా. ‘హరి హర వీరమల్లు’ బిజినెస్ ని నిర్మాత AM రత్నం హోల్డ్ లో పెట్టడానికి ముఖ్య కారణం ఆయన కోరుకున్న రేట్స్ కి బిజినెస్ జరగాలి అనే. ట్రైలర్ విడుదల వరకు ఈ సినిమా ఎలా ఉంటుంది?, ఏమిటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా ఎంత పెద్దదో, ఏ రేంజ్ కంటెంట్ ఉందో అందరికీ అర్థమైంది. అభిమానులు ఆ ట్రైలర్ ని ఎన్ని చూసినా తనివితీరదు అనే రేంజ్ లో రిపీట్స్ లో చూస్తూనే ఉన్నారు. బయ్యర్స్ కి కూడా థియేట్రికల్ ట్రైలర్ తెగ నచ్చేసింది. ఇప్పుడు నిర్మాత AM రత్నం అడిగినంత రేట్స్ కి అటు ఇటుగా ఇవ్వడానికి బయ్యర్స్ ఒప్పుకుంటున్నారు.
నైజాం ప్రాంతం హక్కులు మొదటి నుండి AM రత్నం 65 కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తూ వచ్చాడు. అక్కడి నుండి క్రిందకు దిగలేదు. కానీ సినిమాకు అప్పట్లో అంత బజ్ క్రియేట్ అవ్వకపోవడంతో ట్రైలర్ విడుదల వరకు హోల్డ్ లో పెట్టాడు నిర్మాత. ఇప్పుడు ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడని టాక్. ఇది ఆల్ టైం రికార్డు రేట్ కాదు కానీ,రీసెంట్ గా విడుదలైన అన్ని పాన్ ఇండియన్ సినిమాలకంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈస్ట్ గోదావరి ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది టాక్. నెల్లూరు జిల్లా 7 కోట్ల 50 లక్షలకు దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ మూడు ప్రాంతాలకే 78 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. ఇక పూర్తి స్థాయి బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.