Rashmika Mandanna: రష్మిక మందాన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె గత రెండు చిత్రాలు యానిమల్, పుష్ప 2 వందల కోట్లు వసూలు చేశాయి. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ లో రష్మిక ఒకింత బోల్డ్ రోల్ చేసింది. రన్బీర్ కపూర్ తో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక పుష్ప 2 తో రష్మిక వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఏకంగా బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది.
అల్లు అర్జున్ హీరో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 నాలుగు వారాల అనంతరం కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. 2000 కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరడం ఖాయం అంటున్నారు. పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక, అనుకోని ప్రమాదానికి గురయ్యారు. రష్మిక ఫిట్నెస్ ఫ్రీక్. రోజు కఠిన వ్యాయామం చేస్తుంది. కాగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న రష్మిక ప్రమాదానికి గురయ్యారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
గాయపడిన రష్మిక మందాన హాస్పిటల్ కి వెళ్లారట. వైద్యులు పరీక్షలు నిర్వహించి, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. దాంతో రష్మిక కొన్నాళ్ళు షూటింగ్ కి దూరం కానున్నారట. తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్న రష్మికకు ఇది ఊహించని దెబ్బ అని చెప్పాలి. రష్మిక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జంటగా సికిందర్ మూవీ చేస్తుంది. అలాగే మరో హిందీ చిత్రం ఒప్పుకుంది.
రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. రష్మిక చేతిలో ఉన్న మరో క్రేజీ మూవీ కుబేర. ధనుష్, నాగార్జున నటిస్తున్న కుబేర చిత్రం. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. కుబేర చిత్ర ప్రోమో ఆసక్తి రేపుతోంది.