Dil Raju: సోలోగా రామ్ చరణ్ కెరీర్లో గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ మూవీ. కొన్ని కారణాలతో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఆలస్యమైంది. దాంతో అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు చేశారు. శంకర్ సినిమాలు చాలా గ్రాండ్ గా ఉంటాయి. అదే స్థాయిలో బడ్జెట్ కూడా ఉంటుంది. గేమ్ ఛేంజర్ నిర్మాణానికి దిల్ రాజు రూ. 400 కోట్లకు పైనే ఖర్చు చేశాడు అనే వాదన ఉంది. దిల్ రాజుకు లాభాలు రావాలంటే ఈ చిత్రం పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
అయితే గేమ్ ఛేంజర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం అనూహ్య పరిణామం. గేమ్ ఛేంజర్ స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి. శంకర్ తన గత చిత్రాలను మిక్స్ చేసి గేమ్ ఛేంజర్ చేశాడు. ఆయన మార్క్ గేమ్ ఛేంజర్ లో కనిపించలేదు అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. రామ్ చరణ్ గొప్పగా నటించి మెప్పించారని అంటున్నారు.
సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ మూవీపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ డిజాస్టర్ మూవీని బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటున్నారని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా టాక్ సినిమా ఫలితాలను నిర్ణయిస్తున్న క్రమంలో గేమ్ ఛేంజర్ ని ఈ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయి.
ఒక ప్రక్క గేమ్ ఛేంజర్ మూవీపై నెగిటివ్ ప్రచారం జరుగుతుండగా.. దిల్ రాజు అభిమానులతో పాటు థియేటర్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేశారు. భ్రమరాంబ థియేటర్లో నటుడు సూర్య, దిల్ రాజు గేమ్ ఛేంజర్ వీక్షించారు. అనంతరం మీడియాతో దిల్ రాజు మాట్లాడారు. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అభిమానులు గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన అన్నారు. గేమ్ ఛేంజర్ మంచి ఫలితం అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే సంక్రాంతి సీజన్ కావడంతో మూవీని టాక్ తో సంబంధం లేకుండా చూస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీ విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.