Rakul Preet Singh: సౌత్ ఇండియా లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్ ప్రేస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైనా ఈమె అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతోంది.

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో ఇటీవల ఈమె నటించిన సినిమాలని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ హీరోయిన్ డిమాండ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు అనే చెప్పాలి..ఒక్కప్పుడు సినిమాకి రెండు కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే రకుల్ ప్రీత్ సింగ్..ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయిల వరుకు డిమాండ్ చేస్తుందట..కేవలం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా ఈమె బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది..ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలన్నీ బాలీవుడ్ వి కావడం విశేషం..మన సౌత్ నుండి ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటి అంటే ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇల్లు ఒక ప్రముఖ హీరో బహుమతి గా ఇచ్చాడట..దీని విలువ కనీసం 5 కోట్ల రూపాయిల వరుకు ఉంటుందని అంచనా..అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక ప్రముఖ హీరోతో చాలా కాలం డేటింగ్ చేసిందని..ఆ సమయం లోనే ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆమె హీరో తో బ్రేకప్ చేసుకుందని తెలుస్తుంది..ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో మన అందరికి తెలిసిందే.

.జాకీ భగ్నానీ అనే అతనితో డేటింగ్ లో ఉన్నట్టు రకుల్ ప్రీత్ సింగ్ అనేకసార్లు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది..ఈయన ఇటీవలే OTT లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న రన్ వే 34 అనే చిత్రానికి రచయితగా వ్యవహరించాడు..ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో తన పై వస్తున్నా రూమర్స్ పై స్పందించింది..ఆమె మాట్లాడుతూ ‘నేను కస్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటే దానిని నాకు ఎవరో హీరో బహుమతిగా ఇచ్చాడంటూ ప్రచారం చెయ్యడం చాలా బాధ కలిగించిందంటూ’ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది..మరి ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ ఎవరికీ తెలియదు..సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి అన్ని సహజం కనుక ఈ రూమర్స్ ని నమ్మే వాళ్ళు ఉంటారు..అలాగే నమ్మని వాళ్ళు కూడా ఉంటారు.
Also Read:Naresh and Pavithra Lokesh: నరేశ్, పవిత్రలు విడాకులు తీసుకున్నాకే పెళ్లి..!
Recommended Videos
[…] […]