https://oktelugu.com/

Prabhas: రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ తో పోటీ పడలేకపోతున్న స్టార్ హీరోలు… ఇంతకీ ఆయన ఎంత తీసుకుంటున్నాడు..

సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కోరకంగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ వరుస సక్సెస్ లు వస్తుంటే మరి కొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా కూడా సక్సెస్ లు కనిపించక పోవచ్చు. కానీ కష్టాన్ని మాత్రం వదలకుండా అలాగే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అవుతామనే ఒక ధృడ సంకల్పాన్ని మాత్రం మన ముందు తరం హీరోలు మనకు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:04 AM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన కోసం ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడు ఎదురుచూస్తున్నాడు అంటే ఆయన రేంజ్ ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రభాస్ సంవత్సరంలో రెండు సినిమాలు చేస్తానని తన అభిమానులకు ప్రామిస్ అయితే చేశాడు. దానికి తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ని ఉద్దేశించి కొంతమంది దర్శకులు కథలను రెడీ చేస్తున్నప్పటికీ ఆ కథల్లో పెద్దగా మ్యాటర్ అయితే ఉండడం లేదు. కేవలం స్టార్ట్ హీరోలను మాత్రమే బేస్ చేసుకొని సినిమాలను ముందుకు తీసుకెళ్ళలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇక అలాంటి క్రమంలోనే కొంత మంది దర్శకులు అతనకు కథలను చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా మంది ప్రొడ్యూసర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.

    ఆయనకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చైన సరే తమ సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో స్టార్ డైరెక్టర్లు ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల మీద గాని అందుకుంటున్న సక్సెస్ ల మీద కానీ భారీ ప్రాఫిట్స్ రావాలంటే అది ప్రభాస్ వాళ్ళనే అవుతుందని నమ్ముతున్న ప్రొడ్యూసర్లు ఆయనకు దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను చెల్లిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

    ఇంకా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఇది అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. మరి బాలీవుడ్, టాలీవుడ్ లలో ప్రభాస్ స్టార్ డమ్ ముందు ఏ ఒక్క హీరో కూడా నిలబడలేకపోతున్నారనేది వాస్తవం… ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో కనుక సూపర్ సక్సెస్ లను అందుకుంటే ఆ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 100 కోట్లు తీసుకుంటున్న హీరోలే లేరు అలాంటిది ప్రభాస్ ఏకంగా రెండు వందల కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటున్నాడంటే ఆయన స్థాయి ఏ రేంజ్ లో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు…

    ఇక సలార్, కల్కి లాంటి వరుసగా రెండు సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన తన తదుపరి సినిమాల కోసం మరింత రెమ్యూనిరేషన్ ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి మరి తన సినిమాలతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించి ఆ తర్వాత ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…