Rajamouli- Mahesh babu Movie : దర్శక ధీరుడు రాజమౌళి చేసే మ్యాజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడికి ఆయన అంటే ఏంటో ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిని సూపర్ సక్సెస్ గా నిలిపి 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న ఒకే ఒక దర్శకుడిగా కూడా ఆయన పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇక అలాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా తన టీమ్ తో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న లెక్కలను కూడా సెట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది రాజమౌళికి మహేష్ బాబుకి భారీ గుర్తింపును తీసుకొచ్చి పెడుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరం దాటినప్పటికీ ఇంకా ఈ సినిమా మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మునిగిపోయిన జక్కన్న ఈ సినిమా సెట్స్ మీదికి ఎప్పుడు వెళుతుంది అనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఇదే విషయం మీద మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన ఆందోళనలకు గురవుతున్నారు. అయితే రాజమౌళి చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్లే ఈ సినిమా లేటవుతుంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
అది ఏంటి అంటే నిజానికి రాజమౌళి ప్రతి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నామనేది క్లారిటీ ఇస్తాడు. కానీ ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మహేష్ బాబుతో తను ఒక సినిమా చేయబోతున్నానని చెబుతూ వస్తున్నారు. అంటే తన దగ్గర కథ పుల్ గా లేకపోయినప్పటికీ తను మహేష్ బాబు సినిమా చేస్తున్నానని చెప్పడంతో అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురుచూస్తున్నారు.
నిజానికి జక్కన్న ఒక సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ దాదాపు సంవత్సరం నుంచి 18 నెలల వరకు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ మొత్తం జరుగుతుందని తెలుస్తుంది. ఇక అది పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేయకపోవడమే ఆయన చేసిన తప్పుగా ఇప్పుడు ట్రేడ్ పండితులు సైతం అభివర్ణిస్తున్నారు.