https://oktelugu.com/

Prashanth Verma : ప్రశాంత్ వర్మ ను తక్కువ అంచనావేస్తున్న స్టార్ హీరోలు…

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి. అందులో కొంతమంది వచ్చిన అవకాశాలను నడుకుంటూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే, మరి కొంత మంది మాత్రం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కూడా చాలా వరకు వెనుకబడిపోతుంటారు... ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్ళ సత్తాను చాటుతూ స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 20, 2024 / 10:11 AM IST

    Prashanth Verma

    Follow us on

    Prashanth Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేయాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేసిన సినిమాల్లో హనుమాన్ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పుడు ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అంటూ పలు రకాల వార్తలైతే వెలబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. కానీ ఆయనకు మంచి అవకాశం అయితే రావడం లేదు. నిజానికి ఆయన పొజిషన్ లో వేరే దర్శకుడు ఉంటే మాత్రం ఇప్పటికే స్టార్ట్ హీరోలతో సైతం సినిమాలను చేసేవాడు. కానీ వందల కోట్ల ప్రాఫిట్ ను అందించినప్పటికి ప్రశాంత్ వర్మకి మాత్రం హీరోలు హ్యాండ్ ఇస్తున్నారనే చెప్పాలి. మరి ఎందుకు ఆయన విషయంలో ఇలా జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి బాలీవుడ్ హీరో అయిన రన్వీర్ సింగ్ కూడా ఈయనతో సినిమా చేస్తానని చెప్పి మధ్యలో తప్పుకున్నాడు.

    మరి మిగతా హీరోల నుంచి కూడా ఆయనకు ఆదరణ వస్తున్నట్టే అనిపిస్తున్నప్పటికి అతన్ని మాత్రం ఫైనల్ చేసి ఏ హీరో కూడా సినిమాను అనౌన్స్ చేయడం లేదు. కారణం ఏదైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి మంచి మేకర్ ను మిస్ చేసుకోవడం ఇప్పుడు స్టార్ హీరోలు చేస్తున్న దురదృష్టమనే చెప్పాలి.

    ఇప్పటికే ఆయన చేసిన సినిమాల పట్ల ఒక వైవిధ్యాన్నైతే ప్రదర్శించాడు. కానీ మన హీరోలు మాత్రం ఆయనకు అవకాశాన్ని ఇవ్వడంలో ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా అవకాశాలను అందిపుచ్చుకొని ముందే అతని మీద ఖర్చిఫ్ వేసుకుంటే మంచిదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జై హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడని వాళ్ళు భావిస్తున్నారు.

    ఇక అప్పుడు ఏ హీరో అతనితో సినిమా చేయాలనుకున్నా కూడా ఆయనతో సినిమా చేసే అవకాశాలు ఆ హీరోలకు రాకపోవచ్చు. అందుకే ముందే అతన్ని బుక్ చేసుకుంటే మంచిదని మరికొంతమంది సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ యూనివర్స్ కింద ఆయన ఎవరిని లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు