IND VS NZ Test : బెంగళూరులో కివీస్ ను పడగొడుతుందా? భారత్ 107 పరుగుల టార్గెట్ ను కాపాడుకుంటుందా? గత చరిత్ర ఏం చెబుతోంది?

బెంగళూరు వేదికగా చిన్న స్వామి మైదానంలో జరుగుతున్న భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. రెండవ ఇన్నింగ్స్ లో ఫినిక్స్ పక్షి లాగా పుంజుకున్న భారత్.. 462 రన్స్ కు ఆల్ అవుట్ అయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 10:13 am

IND VS NZ Test

Follow us on

IND VS NZ Test :  యువ ఆటగాడు సర్ఫ రాజ్ ఖాన్(150) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ (99) సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ (70), రోహిత్ శర్మ (52) పర్వాలేదనిపించారు. దీంతో టీమిండియా న్యూజిలాండ్ జట్టు ముందు 107 రన్స్ టార్గెట్ ఉంచింది. అయితే ఈ స్వల్ప స్కోర్ ను భారత్ కాపాడుకుంటుందా? అనూహ్య విజయాన్ని సాధిస్తుందా? గత పరిణామాలు ఏం చెబుతున్నాయి? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో టీమిండియా గతంలో సాధించిన రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. తక్కువ స్కోరు చేసినప్పటికీ.. గెలిచిన ఉదంతాలు ఉన్నాయి. భారత జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకసారి 107 రన్స్ టార్గెట్ ను కాపాడుకోగలిగింది. ఆస్ట్రేలియా జట్టుతో 2004లో వాంఖడే మైదానం వేదిక జరిగిన టెస్టులో 13 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ నాయకత్వం వహించాడు. 107 రన్స్ టార్గెట్ తో టీమిండియా రంగంలోకి దిగింది. బలమైన ఆస్ట్రేలియా జట్టును 93 రన్స్ కే ఆలోచిస్తుంది. తద్వారా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 1981 లో మెల్ బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 143 రన్స్ టార్గెట్ ను డిపెండ్ చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలో 83 రన్స్ కే నిలుపుదల చేసింద. 1969 లో ముంబైలో కివీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 188 పరుగుల లక్ష్యాన్ని.. అద్భుతంగా కాపాడుకుంది. 1972లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ జట్టు ఎదుట 192 పరుగుల టార్గెట్ విధించింది. ఇంగ్లాండ్ జట్టు కేవలం 163 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 2015లో మొహాలీ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో భారత్ 218 రన్స్ టార్గెట్ విధించగా.. దక్షిణాఫ్రికా జట్టు 19 పరుగులకే చాప చుట్టింది. 1959లో కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎదుట భారత్ 225 రన్స్ టార్గెట్ విధించింది. ఆస్ట్రేలియా 105 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. 1981లో వాంఖడే మైదానం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 241 రన్స్ టార్గెట్ విధించింది. ఇంగ్లాండ్ జట్టు 102 రన్స్ కు ఆల్ అవుట్ అయింది.

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 143 రన్స్ టార్గెట్ విధించింది. అయితే ఆస్ట్రేలియా 83 పరుగులకే కుప్ప కూలింది. 1996లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికా ఎదుట 170 రన్స్ టార్గెట్ విధించింది. దానిని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 105 రన్స్ కు ఆల్ట్ అయింది. 1996లో బ్రో బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ ఎదుట 188 రన్స్ టార్గెట్ విధించింది. కానీ న్యూజిలాండ్ 127 పరుగులకు చాప చుట్టింది. 2017లో బెంగుళూరు వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 188 పరుగుల టార్గెట్ విధించింది. అయితే ఆస్ట్రేలియా 112 పరుగులకే ఆల్ అవుట్ అయింది. జోహన్నెస్ బర్గ్ వేదికగా 2018 లో జరిగిన మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికా ఎదుట 241 రన్స్ టార్గెట్ విధించింది. చివరికి దక్షిణాఫ్రికా 177 రన్స్ కు ఆల్ అవుట్ అయింది.