Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయనలాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను స్టార్ట్ డైరెక్టర్ గా కూడా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతూ వస్తున్నాయి… ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఆయన శిష్యులు సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. నిజానికి ఉప్పెన సినిమా అవకాశం రావడానికి కూడా సుకుమార్ తనకి చాలా వరకు హెల్ప్ చేశాడు. ఓకే ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాకి కూడా సుకుమార్ చాలావరకు అతనికి హెల్ప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మొదటి నుంచి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నిజానికి బుచ్చిబాబు సుకుమార్ దగ్గర వర్క్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ చదువుతోనే అతనికి సినిమాలను సెట్ చేసి పెడుతున్నాడు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో సుకుమార్ మీద కొంతవరకు ప్రెజర్ పెరుగుతుందట. ఎందుకు అంటే బుచ్చిబాబు ఈ సినిమాని ఎలా డీల్ చేస్తాడు అనే దానిమీద సుకుమార్ చాలావరకు ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తోంది.
అయినప్పటికీ సుకుమార్ దగ్గరుండి మరి ఈ స్క్రిప్టు ను ఫైనలైజ్ చేసి తనే ఈ సినిమాను సెట్ చేశాడు. ఇక మొత్తానికైతే బుచ్చిబాబు వెనకాల సుకుమారు ఉన్నాడనే ధైర్యంతోనే బుజ్జిబాబు అంత పెద్ద భారీ ప్రాజెక్టుని సెట్ చేసుకున్నాడు. నిజానికి రామ్ చరణ్ కూడా సుకుమార్ మీద కాన్ఫిడెన్స్ తోనే ఈ సినిమాని బుచ్చిబాబు కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి బుచ్చిబాబు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి బుచ్చిబాబు ఈ సినిమాని ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమా గా నిలుపుతాడు అనేది…