Star Heroes sons interested in Direction: సినిమా ఇండస్ట్రీలో బ్యా గ్రౌండ్ తో వచ్చిన హీరోలు సక్సెస్ లను సాధిస్తారనే గ్యారంటీ లేదు. సోలో గా వచ్చిన హీరోలు ఫెయిలవుతారని చెప్పలేం… ఎవరైతే అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటారో వాళ్లు మాత్రమే టాప్ లెవల్ కి వెళ్తారు. ఈ కొంచెం తడబడిన డౌన్ ఫాల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న హీరోలందరు తమకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతులోనే ప్రతి ఒక్కరు సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకుంటున్న చాలామంది నటులు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక స్టార్ హీరోల కొడుకులు సైతం ఇండస్ట్రీకి హీరోలుగా రావాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల కొడుకులు డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రవితేజ కొడుకు మహాధన్ భూపతిరాజ్ తెలుగు టాప్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ దగ్గర డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకే ఆయన చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాకి డైరెక్షన్ లో టీమ్ లో వర్క్ చేస్తున్నాడు.
Also Read: పెళ్లి తర్వాత అభిమానులకు విజయ్ దేవరకొండ, రష్మిక స్వీట్ సర్ప్రైజ్..వీడియో వైరల్!
ఈ సినిమాతో తను డైరెక్షన్ కి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకుని తనే స్వయంగా ఒక సినిమాను డైరెక్షన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అతనితో పాటుగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సైతం మొదట డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒక సినిమాతో డైరెక్షన్ చేసి ఆ తర్వాత హీరోగా మారతాడా? లేదంటే తను డైరెక్షన్ చేసిన సినిమా సక్సెస్ సాధిస్తే డైరెక్టర్ గానే కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ హీరోలు కొడుకులందరు డైరెక్షన్ వైపే అడుగులు వేయడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హీరో అంటే డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్తాడు. కానీ డైరెక్టర్ కి చాలా ప్రెషర్ ఉంటుంది వాటన్నింటిని కంట్రోల్ చేసుకొని ఒక సినిమాని సక్సెస్ చేయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. స్టార్ హీరోల కొడుకులు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…