Srikanth Odela: దసర సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…ప్రస్తుతం నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతోంది..ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేశాడు. ఇక తన నుంచి రాబోతున్న సినిమాలన్నీ ఇలానే ఉండబోతున్నాయి అనే ధోరణిలో కూడా ప్రేక్షకులకు ఒక హింట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేస్తాడు. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శ్రీకాంత్ చిరంజీవితో సినిమా చేసిన, చేయకపోయిన పెద్దగా పోయేదేమీ లేదని పలువురు సినిమా మేధావులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అరడజన్ మంది స్టార్ హీరోలు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఒక్క సక్సెస్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ ను మారుస్తుందని చెప్పడానికి శ్రీకాంత్ ఓదెలను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నలిగిపోయిన తర్వాత ఆయనకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. దాంతో తనను తాను ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఇక శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్లలో రామ్ చరణ్ కూడా ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. రామ్ చరణ్ వీలైనంత తొందరగా శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం శ్రీకాంత్ పారడైజ్ సినిమా తర్వాత చిరంజీవి సినిమాని ఫినిష్ చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్యారడైజ్ సినిమాతో పాటు చిరంజీవితో చేస్తున్న సినిమా రిసల్ట్ ఎలా ఉంటుందనే దానిమీదనే రామ్ చరణ్ సినిమా డిపెండ్ అయ్యి ఉంటుందనేది వాస్తవం…ఈ రెండు సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలిపితే మాత్రం శ్రీకాంత్ ఓదెలకు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశం వస్తోంది. లేకపోతే కష్టమనే చెప్పాలి…