H-1B Visa Lottery Canceled: పిచ్చి పలు రకాలుగా ఉంటుంది. అయితే అమావాస్య, పౌర్ణమి వేళల్లో ఈ పిచ్చి కాస్త ఎక్కువగా ఉంటుందంటారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పరిశీలిస్తే.. ఆయన నిర్ణయాలను నిశితంగా గమనిస్తే.. మనకు ఇదే అర్థమవుతుంది. భారత్‌పై పడి ఏడవడం.. భారత్‌ను దెబ్బతీసే మార్గాలు అన్వేశించడం.. అదను చూసి టారిఫ్‌లు విధించి లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు భారత్ ట్రంప్‌కు తల వంచలేదు. తాజాగా హెచ్–1బీఆ వీసా విధానంలో సంచలన మార్పు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)లాటరీ పద్ధతిని రద్దు చేసి, వెయిటేజ్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27, 2026 నుంచి అమలవుతుంది.
ఉన్నత నైపుణ్యాలు, వేతనాలు కీలకం
ఇకపై ఉన్నత శ్రేణి ఉద్యోగాలు, ఎక్కువ వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్–1బీ వీసాలు కేటాయిస్తారు. ఈ మార్పు అమెరికన్ కార్మికుల దేశీయ ఉద్యోగాలను కాపాడటానికి రూపొందించారు. ప్రతీ సంవత్సరం 65 వేల సాధారణ వీసాలు, ఉన్నత డిగ్రీ ధారకులకు 20 వేలు అదనపు కోటా మార్పులేకుండా కొనసాగుతాయి.
భారతీయ ఐటీ నిపుణులకు సవాళ్లు..
పెద్ద సాంకేతిక కంపెనీలు ఈ విధానంతో సులభంగా ముందుకు సాగవచ్చు. కానీ, స్టార్టప్‌లు, తక్కువ వేతనాలతో పని అందించే సంస్థలు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఈ మార్పు భారతీయ ఐఖీ పరిశ్రమకు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనుందని విశ్లేషిస్తున్నారు. భారతీయులు హెచ్–1బీ అప్లికేషన్‌ల్లో ఆధిపత్యం చెలాయించడంతో ఈ మార్పు మరింత తీవ్రతరం అవుతుంది.