DTC Kishan Naik: ఎవరు ఏమైనా అనుకోని.. చేయి తడిపితేనే పని.. ఈ సూత్రాన్ని ఆయన విధులలో చేరిన నాటి నుంచి అమలు చేస్తూ వచ్చారు.. జీతానికంటే కొన్ని వందల రెట్లు సంపాదించారు. తనతో పని ఉండి వచ్చిన వారందరి దగ్గరనుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. తాను పనిచేసిన ప్రతిచోటా వసూళ్ల వ్యవహారాన్ని దర్జాగా కొనసాగించారు. చివరికి ఆ అధికారి పాపం పండింది.
కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటివరకు అనేకమంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారుల కు చిక్కారు. ఈ జాబితాలో ఈ అధికారికి ప్రథమ స్థానం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే ఈ అధికారి సంపాదించిన సంపాదన ఆ స్థాయిలో ఉంది మరి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రవాణా శాఖలో ఉప కమిషనర్ గా పనిచేస్తున్నారు కిషన్ నాయక్. ఆయనను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు కోర్టులో హాజరు పరిచారు న్యాయమూర్తి ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు ఫలితంగా కిషన్ నాయక్ ను అధికారులు చర్చలు కూడా జైలుకు తరలించారు కొద్దిరోజులుగా ఏసీబీ అధికారులు ఇల్లు, ఇతర ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అధికారుల తనిఖీలలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. పలు జిల్లాలలో కిషన్ నాయక్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.. అనేక ప్రాంతాలలో 40 ఎకరాలకు పైగా పొలం, హోటల్స్, భారీగా బంగారాన్ని నిల్వ చేసినట్టు తెలుస్తోంది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో ₹100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
కిషన్ నాయక్ ప్రజా ప్రతినిధులకు లంచాలు ఇచ్చి, భారీగా డబ్బులు వచ్చే ప్రాంతాలకు బదిలీ చేయించుకునేవారు. అంతేకాదు, ఆ ప్రాంతాలలో ఎక్కువ కాలం విధులలో ఉండేవారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే భారీగా కిషన్ నాయక్ సంపాదించినట్లు తెలుస్తోంది. తన సంపాదనకు ప్రత్యేకంగా వ్యక్తులను కూడా ఆయన నియమించుకున్నట్టు ఏసీబీ అధికారుల తనిఖీలలో తేలింది. అయితే బినామీ పేర్లతో కూడా కిషన్ నాయక్ ఆస్తులను సంపాదించారని, వాటి విలువ కూడా తెలియాల్సి ఉందని, ఏసీబీ అధికారులు చెబుతున్నారు.