Star Heroes: ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోల మధ్య మంచి పోటీ అయితే నడుస్తుంది. ఇక వీళ్ళ సినిమాల రిలీజ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మరొక హీరో తన సినిమాను రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకొని తన మార్కెట్ ని పెంచుకుంటు పక్క హీరో మార్కెట్ ను దెబ్బ తీస్తున్నాడు. అందుకే ఇప్పుడు మన హీరోలు వరుసగా ఎక్కువ సినిమాలు చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే మరొక హీరో మార్కెట్ మీద భారీగా దెబ్బ పడుతుంది.ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని భారీగా దెబ్బ కొట్టాడు. అలా వైకుంఠపురంలో సినిమాకి ముందు అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ కి ఉన్నంత మార్కెట్ అయితే లేదు. కానీ అలా వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఎన్టీఆర్ మార్కెట్ ను అల్లు అర్జున్ కబ్జా చేసేశాడు.
ఇక ఎన్టీఆర్ 2018 వ సంవత్సరంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తర్వాత మూడు సంవత్సరాల వరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, పుష్ప లాంటి సినిమాలను రిలీజ్ చేశాడు. కాబట్టి ఈ రెండు సినిమాలతో ఆయన మార్కెట్ భారీగా పెరిగింది. ఇక పుష్ప సినిమాతో అయితే తను ఒక సూపర్ స్టార్ గా ఎదిగాడనే చెప్పాలి. అలా హీరోలు సినిమాలు చేయడం లేట్ అయిన లేదా రిలీజ్ లలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా వాళ్ల మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఒక దర్శకుడితో సినిమా చేయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తూ తమ సినిమాని ఏ టైమ్ కి రిలీజ్ చేయాలనేది కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకొని దానికి అనుకులం గా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు…