Star hero couple donated 250 crores : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) జంట కచ్చితంగా ఉంటుంది. ఈ దంపతులిద్దరికీ రాహా(Raaha) అనే కూతురు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఎప్పటి నుండో బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అలియా భట్ ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో, రాహా చిన్నతనం లోనే అంత క్యూట్ గా మాట్లాడుతూ ఎన్నోసార్లు కనిపించింది. అయితే రీసెంట్ గా ఈ దంపతులిద్దరూ తన కూతురు పేరిట 250 కోట్ల రూపాయిలు విలువ చేసే ఇంటిని రాసి ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబై లోనే బాంద్రా నడిబొడ్డున్న ఉన్న ఈ కొత్త ఇంట్లోకి త్వరలోనే ఈ దంపతులిద్దరూ తమ కూతురితో కలిసి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ తన తల్లి నీతూ కపూర్ పేరిట రిజిస్టర్ చేయించాడు.
ఈ కాలం లో తల్లికి ఈ స్థాయి విలువని ఇచ్చే కొడుకులు ఎక్కడున్నారు చెప్పండి. ఆస్తి సంరక్షకురాలిగా తన పేరు ని కాకుండా, తన అత్తా పేరుని పెడితే కోడళ్ళు పెద్ద గొడవ పెట్టుకుంటారు. కానీ అలియా భట్ మాత్రం చిరునవ్వుతో మనస్ఫూర్తిగా ఆమె పేరుని రిజిస్టర్ చేయించేందుకు ఒప్పుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఇల్లు రణబీర్ కపూర్ వంశానికి చిహ్నంగా ఉంటూ వస్తుంది. అప్పట్లో రణబీర్ కపూర్ తాతగారు ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో ఈ ఇంటిని కొనుగోలు చేసాడట. ఆ తర్వాత రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కూడా ఈ ఇంట్లోనే ఉండేవాడట. అలా వారసత్వంగా రిషి కపూర్ తదనంతరం ఈ ఇల్లు రణబీర్ కపూర్ చేతుల్లోకి వచ్చింది. దీంతో ఆయన మూడు సంవత్సరాల నుండి ఆ ఇంట్లోని పాత గుర్తులు చెరిగిపోకుండా రీ మోడలింగ్ చేయిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు రీ మోడలింగ్ పూర్తి అయినా వెంటనే తన కూతురు రాహా పేరిట ఈ ఇంటిని రిజిస్టర్ చేయించాడు.
మరో రెండు నెలల్లో ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారట. ఈ ఏడాది జరగబోతే దీపావళి ని కుటుంబ సమేతంగా ఈ కొత్త ఇంట్లోనే జరుపుకోబోతున్నారట. ఆదర్శవంతమైన దాంపత్య జీవితం ఇదే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన హిందీ రామాయణం మూవీ లో శ్రీరాముడి గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది . ఇందులో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా,రావణుడిగా యాష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.