Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలో తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న దర్శకుల్లో మన తెలుగు దర్శకులు మొదటి స్థానంలో ఉన్నారు. రాజమౌళి(Rajamouli), సందీప్ రెడ్డివంగా(Sundeep Reddy Vanga), సుకుమార్(Sukumar), ప్రశాంత్ వర్మ (Prashanth Varma) లాంటి దర్శకులు మంచి సక్సెస్ లను సాధించిన దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు. కానీ త్రివిక్రమ్ (Trivikram) మాత్రం ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం అయిపోయాడు. అల్లు అర్జున్ (అల్లు Arjun) తో మైథాలజికల్ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించబోతున్న పాన్ ఇండియాలో ఈ సినిమా భారీ బడ్జెట్లో తెరకెక్కుతుంది అంటూ త్రివిక్రమ్ గత కొన్ని రోజుల క్రితం కొన్ని మాటలు చెప్పినప్పటికి అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ కి కాకుండా అట్లీ(Atlee) కి ఛాన్స్ ఇచ్చి త్రివిక్రమ్ ను పక్కన పెట్టేశాడు.
దాంతో ప్రస్తుతం త్రివిక్రమ్ – వెంకటేష్ ను హీరోగా పెట్టి తెలుగులో ఒక భారీ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాబోతుంది. మరి ఇలాంటి సందర్భంలో తన తోటి దర్శకులు తనకంటే వెనకాల వచ్చిన దర్శకులు సైతం తనని బీట్ చేస్తూ ముందుకు సాగుతుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యాడు.
Also Read : త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో వర్కౌట్ అవుతుందా..?
మరి ఆయన పాన్ ఇండియా ఇండస్ట్రీకి వెళ్ళేది ఎప్పుడు, అక్కడ సక్సెస్ ని సాధించేది ఎప్పుడు, అక్కడ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఇంకెప్పుడు అంటూ మరికొంతమంది అతని అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయనకు తీవ్రమైన కష్టాలైతే వచ్చాయి.
ఇక త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో మార్కెట్ లేదనే ఒకే ఒక కారణంతో అల్లు అర్జున్ సైతం అతన్ని రిజెక్ట్ చేశాడు అంటే త్రివిక్రమ్ కెరియర్ ఎంత ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…మరి ఇప్పటికైనా గురూజీ మేల్కొని బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే తప్ప అతని గురించి పట్టించుకునే ప్రేక్షకులు కరువైపోతారు. ఇక స్టార్ హీరోలు సైతం అతనికి డేట్స్ ఇవ్వడానికి భయపడి పోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతి శక్తి లేదు…