Trivikram: త్రివిక్రమ్ ఆ ఇద్దరు హీరోయిన్స్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడా..?

Trivikram: ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన హీరోలని నమ్ముకోకుండా హీరోయిన్లతో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 17, 2024 12:25 pm

Is Trivikram doing a lady oriented movie with those two heroines

Follow us on

Trivikram: ఒకప్పుడు రైటర్ గా తన పెన్నుతో అద్భుతమైన మ్యాజిక్కులు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన సినిమాను ఇంకా అనౌన్స్ చేయడం లేదు. ఇదివరకైతే డైలామా లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన హీరోలని నమ్ముకోకుండా హీరోయిన్లతో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పురాణ కథలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా స్టోరీ రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే దానిమీద సర్వత్రా ఆసకైతే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అందులో ఒకరు సంయుక్త మీనన్ కాగా, మరొకరు ఎవరు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే విడాడం లేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరొకసారి భారీ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

Also Read: Kubera Movie: కుబేర సినిమా లో నాగార్జున పాత్ర ఏంటో తెలిసిపోయింది…

ఇక స్టార్ హీరోల కోసం తను వేచి చూడాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యం తోనే తను ఈ కాంబో ను సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు మీద అఫీషియల్ గా ఇంతవరకు అనౌన్స్ మెంట్ రానప్పటికీ మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా మీద క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని కూడా హరిక హాసిని క్రియేషన్స్ లోనే తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ ఒక భారీ సక్సెస్ తో ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.

Also Read: Puri Jagannadh: పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న పాన్ ఇండియా హీరో…

ఇక అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ అల్లు అర్జున్ దానిపైన ఏ విధంగా స్పందించడం లేదు. అందువల్లే అల్లు అర్జున్ మీద కోపంతోనే త్రివిక్రమ్ లేడి ఓరియంటెడ్ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…