Pawan Kalyan upcoming movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు అతని అభిమానులు ఆవేశంతో ఊగిపోతారు. ఆయనను స్క్రీన్ మీద చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన నుంచి వచ్చే సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రానటువంటి గుర్తింపు పవన్ కళ్యాణ్ చేసిన ఈ సినిమాకు రావడంతో ప్రేక్షకులందరు ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి కొంత మంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సురేందర్ రెడ్డి సైతం అతనికి కథనైతే వినిపించాడు. అయితే ఆ కథ చర్చలు జరుగుతున్న సందర్భంలో మరొక స్టార్ డైరెక్టర్ సైతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న మురుగదాస్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నాడు. ఇక మురుగుదాస్ సినిమాతో ఒక సోషల్ మెసేజ్ ని ఇస్తుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
Also Read: ‘ఓజీ’ మొదటి రోజు వసూళ్లు 154 కోట్లు.. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతేనా!
ఈ మధ్యకాలంలో మురుగుదాస్ చేసిన సినిమాలేవి ప్రేక్షకులను అలరించడం లేదు. దాంతో అతనితో సినిమాలు అంటేనే పవన్ కళ్యాణ్ అభిమానులు భయపడిపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ముందుగా ఈ సినిమా కథని త్రివిక్రమ్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ వింటాడు.
కాబట్టి ఒకవేళ త్రివిక్రమ్ కి కథ నచ్చకపోతే ఆయన రిజెక్ట్ చేస్తాడు. లేదు అంటే అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని సక్సెస్ ఫుల్ గా మార్చడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ఇక ఏం జరగబోతుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
