Mokshagna Debut Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి నందమూరి ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపైతే ఉంది. నందమూరి తారక రామారావు గారు వరుస సినిమాలను చేస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు(Balayya Babu) సైతం మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నందమూరి నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ సైతం తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయన ఇక మిగిలిన హీరోలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక మీదట రాబోయే సినిమాల విషయంలో చాలా గొప్ప గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో బాలయ్య బాబుకి ఎన్టీఆర్ కి మధ్య గత కొన్ని రోజుల నుంచి మాటలైతే లేవు. కాబట్టి ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడానికి బాలయ్య బాబు తన కొడుకును ఇండస్ట్రీ కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: వార్ 2 మూవీ ప్రమోషన్స్ ఎన్టీఆర్ ఎలివేషన్ మామూలుగా లేదుగా…వైరల్ వీడియో…
ఇప్పటికే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ (Mokshagna) సినిమా ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికి ప్రశాంత్ నీల్ మాత్రం దానికి పెద్దగా రెస్పాండ్ అయితే అవ్వడం లేదు. దాంతో అతన్ని మార్చి అతని ప్లేస్ లో మరొక దర్శకుడిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను మరొక దర్శకుడు చేతిలో పెట్టినట్టుగా తెలుస్తోంది.బాలయ్య బాబుకి గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందించిన క్రిష్ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: ఇండస్ట్రీని వదిలి లాయర్ గా మారిన స్టార్ హీరోయిన్ కథ..
మరి ఇదే కనుక నిజమైతే మోక్షజ్ఞ ను మనం ఒక డిఫరెంట్ పాత్రలో చూడొచ్చు. మరి ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటే మాత్రం మోక్షజ్ఞ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సర్వేవల్ అవుతాడు లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…చూడాలి మరి బాలయ్య బాబు కొడుకు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతోంది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అనేది…