https://oktelugu.com/

Director KS Ravikumar : రజినీకాంత్ నా సినిమా మొత్తాన్ని చెడగొట్టేసాడు’ అంటూ సంచలన ఆరోపణలు చేసిన స్టార్ డైరెక్టర్!

సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో రజినీకాంత్ మళ్ళీ జతకడుతూ 'కథానాయకుడు', 'లింగ' వంటి చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా లింగ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 05:19 PM IST

    Director KS Ravikumar

    Follow us on

    Director KS Ravikumar : సూపర్ స్టార్ రజినీకాంత్ కి పాన్ ఇండియన్ లెవెల్ లో మార్కెట్ ఏర్పడడానికి కారణమైన చిత్రాలు ‘ముత్తు’, ‘నరసింహా’. ఈ రెండు చిత్రాలకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ చిత్రాలు ఇండియా లోనే కాదు, జపాన్ దేశం లో కూడా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అప్పట్లో ఓవర్సీస్ మార్కెట్ మన సౌత్ హీరోలకు ఉండేది కాదు. ఇండియా లో కేవలం షారుఖ్ ఖాన్ కి మాత్రమే భారీ ఓవర్సీస్ మార్కెట్ ఉండేది. కానీ రజినీకాంత్ ఈ సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్ ని మన సౌత్ ఇండియా కి ప్రారంభించాడు. అలాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో రజినీకాంత్ మళ్ళీ జతకడుతూ ‘కథానాయకుడు’, ‘లింగ’ వంటి చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా లింగ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి.

    క్లైమాక్స్ సన్నివేశాన్ని అప్పట్లో చాలా వెక్కిరించేవారు. ఈ చిత్రం ఫ్లాప్ పై డైరెక్టర్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ‘లింగ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడానికి కారణం రజనీకాంత్ గారే. సినిమా ఎడిటింగ్ విషయం లో ఆయన తలదూర్చకుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ నాకు ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ కి నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు ఆయన. సెకండ్ హాఫ్ మొత్తాన్ని మార్చేశాడు. అనుష్క తో రజనీకాంత్ పై ఒక పాటని చిత్రీకరించాము. అది సినిమా నుండి తొలగించేసారు, అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలక ట్విస్ట్ సన్నివేశాన్ని కూడా తొలగించాడు. చాలా కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సన్నివేశాన్ని జత చేసి, లింగ చిత్రాన్ని గందరగోళం చేసారు. కానీ కమర్షియల్ గా మా సినిమా ఫ్లాప్ కాదు. అప్పట్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆరోజుల్లో ఇలాంటి వసూళ్లు చిన్న విషయం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు కేఎస్ రవి కుమార్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దీనిపై రజిని ఫ్యాన్స్ రవి కుమార్ పై చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆ సన్నివేశాలు బాగాలేవు కాబట్టే రజినీకాంత్ తొలగించాడు.

    నువ్వు తీసిన సన్నివేశాలను తొలగించి బెలూన్ సన్నివేశాన్ని జత చెయ్యించాడంటే, అంతకు ముందు ఎలాంటి దరిద్రమైన సన్నివేశాలు చిత్రీకరించావో అర్థం అవుతుంది అంటూ మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ చిత్రం ఈ నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటి నుండే ప్రారంభం అయ్యింది.