Strong Bond: బంధం బలంగా ఉండాలంటే 2:2:2 పాటించాల్సిందే!

ప్రస్తుతం అందరూ కూడా ఎవరి బిజీలో వాళ్లు ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు. రోజంతా ఆ ఆఫీస్ పనులు, కాస్త తీరిక దొరికితే ఇంటి పనులతో బిజీ అయిపోతున్నారు. అంతే కానీ కుటుంబంతో కొంత సమయం గడపడం వంటివి చేయడం లేదు. ఇలాంటి చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు ఇద్దరి మధ్య జరుగుతాయి

Written By: Kusuma Aggunna, Updated On : October 7, 2024 5:25 pm

Strong-Bond

Follow us on

Strong Bond: ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమూ.. భాగస్వామి కూడా అంతే ముఖ్యం. పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉన్నా కూడా.. పెళ్లయిన తర్వాత లైఫ్‌ సరిగ్గా లేకపోతే జీవితం కష్టమే. పెళ్లయిన కొత్తలో ఉన్నట్లు తర్వాత భాగస్వాములు ఉండరు. సాధారణంగా బంధంలో గొడవలు అనేవి సహజం. అన్నింటిని పెద్దవి చేసుకుంటూ ఉండకూడదు. భాగస్వామిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. పెళ్లయిన కొత్తలో ఎలా భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి నియమాలు పాటిస్తారో.. అలాగే అది కంటిన్యూ చేయాలి. లేకపోతే బంధంలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. భాగస్వాములు అన్న తర్వాత గొడవలు, అలగడం, కోపం అన్ని సహజమే. అన్నింటిని దాటి మర్చిపోయి వెళ్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. బంధంలో ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే జీవితాంతం ఇద్దరూ సంతోషంగా ఉంటారు. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ బాధపడుతూనే ఉంటారు. మరి బంధంలో పాటించాల్సిన ఆ నియమాలేంటో చూద్దాం.

ప్రస్తుతం అందరూ కూడా ఎవరి బిజీలో వాళ్లు ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు. రోజంతా ఆ ఆఫీస్ పనులు, కాస్త తీరిక దొరికితే ఇంటి పనులతో బిజీ అయిపోతున్నారు. అంతే కానీ కుటుంబంతో కొంత సమయం గడపడం వంటివి చేయడం లేదు. ఇలాంటి చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు ఇద్దరి మధ్య జరుగుతాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సమయం చూసుకుని మరి భాగస్వాములు టైమ్ స్పెండ్ చేయాలి. అప్పుడే బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇద్దరి మధ్య కమ్యునికేషన్ పెరుగుతుంది. భాగస్వాములు ముఖ్యంగా 2:2:2 రూల్ పాటించాలి. అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా బంధంలోని ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఈ రూల్ అంటే ప్రతి రెండు వారాలకు భాగస్వామితో డేట్‌కి వెళ్లాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒకరోజు బయటకు వెళ్లాలి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి వారం రోజులు బయటకు వెళ్లాలి. ఇలా షెడ్యూల్‌ను పెట్టుకుని బయటకు వెళ్తే ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఎంత బిజీగా ఉన్నా సరే ఈ రూల్ పాటిస్తే ఇద్దరి మధ్య బంధం సంతోషంగా సాగుతుంది. భాగస్వాములతో మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. దీంతో ఇద్దరు కొన్ని విషయాలను తెలుసుకుని దగ్గర అవుతారు.

రోజంతా ఇంట్లో పనులు, ఆఫీస్‌ పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడైనా భాగస్వామిని బయటకు తీసుకెళ్తే.. అన్ని గొడవలు మర్చిపోతారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఎలాంటి గొడవలు ఉన్న వెంటనే హాయిగా కలిసిపోతారు. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కుదురుతుంది. ఏ బంధంలో అయిన కాస్త ఒత్తిళ్లు ఉంటాయి. కానీ అందరూ అన్నింటిని అర్థం చేసుకోరు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు భాగస్వామితో కూర్చుని మాట్లాడుకోవాలి. కూర్చుని పరిష్కరించుకోవాల్సినవి.. గొడవల వరకు తీసుకెళ్తారు. ఇలా కాకుండా ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ కలిసి గొడవలు, బాధ్యతలు, కుటుంబ విషయాలు అన్ని మాట్లాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు.