Maruthi Wagon R : ఏ నెలలో చూసినా సేల్స్ తగ్గేదేలే.. మైలేజ్ కోసమే ఈ కారును కొంటున్నారా?

ఇప్పటి వరకు చాలా మోడళ్లను మారుతి పరిచయం చేసింది. వీటిలో వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. దశాబ్దాలుగా ఈ కారు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో లభించే ఈ మోడల్ మంచి మైలేజ్ ఇస్తుందన పేరు ఉంది. అయితే తాజాగా ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

Written By: Srinivas, Updated On : October 7, 2024 5:11 pm

Maruthi Wagon R

Follow us on

Maruthi Wagon R :  దేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తూ ఉంటుంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా వివిధ మోడళ్లను తీసుకొస్తుంది. లో బడ్జెట్ తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలనుకునేవారు మారుతి కంపెనీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే మారుతి నుంచి వచ్చే కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఉంటాయని కొందరి భావన. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు చాలా మోడళ్లను మారుతి పరిచయం చేసింది. వీటిలో వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. దశాబ్దాలుగా ఈ కారు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో లభించే ఈ మోడల్ మంచి మైలేజ్ ఇస్తుందన పేరు ఉంది. అయితే తాజాగా ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

మారుతి నుంచి వ్యాగన్ ఆర్ 1999లో రోడ్లపైకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మోడల్ టాప్ సేల్స్ లోనే ఉంటుంది. వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటూ వస్తున్న వ్యాగన్ ఆర్ రోజుకు 500 యూనిట్లు అమ్ముడుపోతున్నట్లు అంచనా. త్వరలోనే వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ వాహనం కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడున్న వ్యాగన్ ఆర్ మైలేజ్ రారాజు అని చెప్పవచ్చు. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులో ఉంది.

వ్యాగర్ ఆర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 90 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది. అయితే పెట్రోల్ వేరియంట్ ను రూ.6.97 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. సీఎన్ జీ వేరియంట్ ను 8.10 లక్షలతో అమ్ముతున్నారు. ఇది సెడాన్ కారు అయినప్పటికీ 341 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఎస్ యూవీ తరహాలో సౌకర్యవంతంగా ఉంటుంది.

2024 ఏడాదిలో అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న కారులో మారుతి వ్యాగన్ ఆర్ ఉంది. ఎందుకంటే ఈమధ్య కొందరు కొత్తగా కారు కొనాలని అనుకునేవారు మైలేజ్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ లో 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ వెర్షన్ మోడల్ 34 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. మైలేజ్ ఎక్కువగా ఇస్తుండడంతో ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత జూలైలో దీనిని 16,191 యూనిట్లు కొనుగోలు చేశారు. ఆగస్టులో 16,450 కార్ల విక్రయాలు జరుపుకున్నాయి. ఏ నెలలో చూసినా ఈ కార్ల అమ్మకాలు తగ్గలేదనడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా దీనిపై రూ.45, 000 తగ్గింపు అందిస్తుండడంతో మరింత మంది ఈ కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక మారుతి వ్యాగన్ ఆర్ మొత్తం 8 వేరియంట్లలో లభిస్తుంది. కొన్ని కార్లు డ్యూయెల్ కలర్లలో కూడా లభిస్తున్నాయి.