Star Director : లోకేష్ కనకరాజ్ కి పరిశ్రమలో మంచి పేరుంది. తనదైన టేకింగ్ తో విలక్షమైన దర్శకుడిగా విజయాలు అందుకుంటున్నారు. ఖైదీ చిత్రం ఆయనకు విపరీతమైన ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి లోకేష్ కనకరాజ్ రాసుకున్న స్క్రీన్ ప్లే అద్భుతం అని చెప్పాలి. ఒక రాత్రి జరిగే కథలో ఫాదర్-డాటర్ సెంటిమెంట్, డ్రగ్ మాఫియా, యాక్షన్ అంశాలు కలగలిపి చక్కగా తెరకెక్కించాడు. ఖైదీ అనంతరం స్టార్స్ లోకేష్ కనకరాజ్ తో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. విజయ్ హీరోగా మాస్టర్ చేశాడు. మాస్టర్ సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read : ప్లాప్ సినిమాలను చేస్తు కెరియర్ చివరి దశలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ వీళ్లేనా..?
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ మొదటి చిత్రం. దానికి కొనసాగింపుగా విక్రమ్ విడుదలైంది. కమల్ హాసన్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం విక్రమ్. తెలుగులో కూడా విక్రమ్ వసూళ్ల వర్షం కురిపించింది. విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తన సినిమాటిక్ యూనివర్స్ లో మూడో చిత్రంగా లియో విడుదలైంది. ఈ మూవీలో విజయ్ హీరోగా చేశాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ హీరో రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుందని సమాచారం. కూలీ మూవీలో నాగార్జున కీలక పాత్ర చేయడం విశేషం.
లోకేష్ కనకరాజ్ టాలెంట్ మెచ్చిన తెలుగు స్టార్స్ సైతం ఆయనతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విక్రమ్ అనంతరం రామ్ చరణ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుందనే ప్రచారం జరిగింది. కాగా తాజాగా లోకేష్ కనకరాజ్ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఒక సినిమాను పూర్తి చేసే సమయాన్ని ఉద్దేశిస్తూ.. లోకేష్ కనకరాజ్ మాట్లాడారు. నేను ఆర్ ఆర్ ఆర్ వలె మూడేళ్లు ఒక సినిమాకు తీసుకోవడం లేదు. నేను నా హీరోలను 6-8 నెలలు ఒకే లుక్ మైంటైన్ చేయండి, అని మాత్రమే అడుగుతాను, అన్నారు.
ఏళ్ల తరబడి సినిమా చేయడం, అందుకు హీరోలను కష్టపెట్టడం చేయను అనే ఉద్దేశంలో లోకేష్ కనకరాజ్ అన్నారు. ఇక్కడ ఆయన ఆర్ ఆర్ ఆర్ ని ఉదహరించారు. దాంతో ఆయన పరోక్షంగా రాజమౌళితో పాటు సంవత్సరాల పాటు సినిమాలు చేసే దర్శకులను విమర్శించినట్లు అయ్యింది. పాతికేళ్ల కెరీర్లో రాజమౌళి 12 చిత్రాలు చేశారు. లోకేష్ కనకరాజ్ గత ఐదేళ్లలో 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో బడా దర్శకుల్లో ఒక్క అనిల్ రావిపూడి మాత్రమే వేగంగా సినిమాలు చేస్తున్నారు.
Also Read : ఈ స్టార్ డైరెక్టర్స్ వాళ్ల స్టైల్ మార్చకోకపోతే మరో మూడో సంవత్సరాల్లో ఫేడ్ ఔట్ అయిపోవాల్సిందేనా..?