star directors : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు సాధించడం అనేది అంత ఈజీ కాదు. సినిమా దర్శకులు ఎప్పటికప్పుడు వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ ఈ జనరేషన్ కి తగ్గట్టు కథలను ఎంచుకొని సినిమాలు చేసిన వారు మాత్రమే ఇక్కడ సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ ఉంటారు. చాలామంది దర్శకులు ఇప్పుడు ఫేడ్ ఔట్ దశకి దగ్గర్లో ఉన్నారు. ఒకప్పుడు సూపర్ సక్సెస్ లను అందించిన వాళ్లే ఇప్పుడు ఎందుకు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయలేకపోతున్నారు అంటూ ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున విమర్శలైతే వెలుబడుతున్నాయి. ఇక ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న దర్శకులలో పూరి జగన్నాథ్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిజానికి పూరి జగన్నాధ్ ఒకప్పుడు బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, బిజినెస్ మాన్ లాంటి వరుస సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ప్రేక్షకులను మ్యాజిక్ చేయడంలో ఏమాత్రం తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. నిజానికి ఆయన చేసే ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గానే మిగులుతూ ఉంటాయి. అయినప్పటికి ఆయన హీరోలు అన్ని సినిమాల్లో ఒకే క్యారెక్టరైజేషన్ తో ఉండటం వల్ల చూసే ప్రేక్షకుడికి ఆ సినిమాలు విసుగు పుట్టిస్తున్నాయి. దానివల్లే ఆయన సినిమాలను చూడడానికి ఏ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించలేకపోతున్నారు…
శ్రీను వైట్ల
యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలను చేయడంలో శ్రీను వైట్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పుడు చాలామంది మీమర్స్ వాడుకునే పేజీల్లో ఆయనకు సంబంధించిన సినిమా డైలాగ్స్ ఎక్కువగా ఉండడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలో రీసెంట్ గా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అందించకపోవడంతో ఆయన ఫేడౌట్ దశకి చాలా దగ్గరగా ఉన్నాడు అంటూ వార్తలైతే వినపడుతున్నాయి.
మరి మొత్తానికైతే శ్రీనువైట్ల లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఫేడౌట్ దశకు దగ్గరలో ఉండడం అతని అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పాలి. కామెడీ సినిమాలను చేయడంలో ఈయనకు సపరేట్ గుర్తింపు అయితే ఉంది. కానీ ఆ మ్యాజిక్ ని ఇప్పుడు రిపీట్ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన అప్డేట్ అవ్వకుండా ఓల్డ్ కథలతో ఓల్డ్ నరేషన్ తో ముందుకు రావడమే దానికి ముఖ్య కారణం అని సినీ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…