CM Chandrababu: ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా రకాల ఈక్వేషన్స్ పనిచేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. సమాజం పైన వీరు ప్రభావితం చేయగలరు. ఆపై ఎన్నికలు నిర్వహించేది కూడా వీరే. అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకం కాకూడదని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆ రెండు వర్గాలే కారణం అన్న విశ్లేషణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని వెంటాడారని, వేధించారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉపాధ్యాయుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆ వర్గంలో వ్యతిరేకతను పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ తింటాడట.. బాబు ఫుడ్ స్టైల్ ఏంటో తెలుసా?
* వైసిపి పై వ్యతిరేక భావన..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి వాటికోసం చాలా యాప్ లు ఉండేవి. ప్రధానంగా యాప్ లో పాఠ్యపుస్తకాల పంపిణీ, మనబడి- నాడు నేడు, పీఎం శ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్ లు ఉండేవి. అయితే ఈ యాప్ ల నమోదు ఒకవైపు, విద్యా బోధన మరోవైపు ఇబ్బందికరంగా మారేది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద కూడా అప్పట్లో ఉపాధ్యాయులకు విధులు వేశారని విమర్శలు వచ్చాయి. ఈ కారణాలతోనే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకత పెంచుకున్నాయి. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉందన్నది ఒక అనుమానం. అయితే ఏరి కోరి తెచ్చుకున్న కూటమి సైతం ఇప్పుడు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోందన్న టాక్ ప్రారంభం అయింది.
* కొత్తగా లీవ్ యాప్..
ఇటీవల కూటమి ప్రభుత్వం( Alliance government ) ఉపాధ్యాయుల కోసం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ ‘లీప్’ యాప్ తెచ్చింది. ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నిషన్ ఐడి పాస్ వర్డ్ తో ఈ యాప్ లో లాగిన్ కావచ్చు. ఈ యాప్ లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, గ్యాస్ బోర్డు అనే ఆరు విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది టీచర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో దీనిపై భిన్న ప్రచారం జరుగుతోంది. ఈ ముఖ హాజరు ద్వారానే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఏరి కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వం లో కనీసం వేతనాలు పెరగలేదు.. ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు అన్నది వైసిపి చేస్తున్న ప్రచారం. చంద్రబాబు ఉపాధ్యాయుల విషయంలో టైట్ చేస్తున్నారని.. క్రమేపీ ఇబ్బందులు తప్పవని సంకేతాలు ఇచ్చేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుండడం విశేషం. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని యాప్ ల స్థానంలో.. వచ్చిన లీవ్ యాప్ బాగుందని ఉపాధ్యాయ వర్గాల్లో సంతృప్తి కనిపిస్తోందని.. పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అప్పట్లో ఓవర్ యాక్షన్ చేసిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఊ అంటావా సీఎం? అని పాటలు పాడరేం? #cbnfailedcm pic.twitter.com/O6aKojYhQD
— జగన్నాథరథచక్రం (@Radhachekram) May 14, 2025