Star Directors : ఇండస్ట్రీ లో సక్సెస్ లు వస్తున్నాయి కదా అని ఒకే ఫార్మాట్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే మాత్రం వాళ్లు చాలా తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయే అవకాశాలైతే ఉంటాయి. సినిమా సినిమాకి మధ్య జానర్ ని మార్చుకుంటూ ప్రేక్షకులలో ఒక డిఫరెంట్ అనుభూతిని అందిస్తూ మొత్తానికైతే సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చిన వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువ రోజులపాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) లాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా డార్క్ లైట్ లో నడుస్తూ ఉంటాయి. ఆయన ఫుల్ లైట్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడడు. మొత్తం లో లైట్ లో డార్క్ ఫేజ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఎమోషన్ ని హైలెట్ చేస్తూ ముందుకు సాగాడు. ఇక భారీ ఎలివేషన్ ఇస్తూ ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) తో చేస్తున్న సినిమాని కూడా అలాగే డార్క్ ఫేజ్ లో తీసి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు. కే జి ఎఫ్ సిరీస్, సలార్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఇలా వరుసగా ఆయన ఈ సినిమాలను ఎంచుకోవడం పట్ల కొంతమంది సినిమా మేధావులు సైతం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు… ఇక ఎప్పుడు ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతాడు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు.
Also Read : ప్లాప్ సినిమాలను చేస్తు కెరియర్ చివరి దశలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ వీళ్లేనా..?
అలాగే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి దర్శకుడు సైతం ఇప్పటి వరకు ఆయన తీసిన రెండు సినిమాలు కూడా బోల్ట్ కంటెంట్ తో తెరకెక్కినవే కావడం విశేషం. మరి ఇప్పుడు ప్రభాస్ (Prabhas) చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ కథతో తెరకెక్కిస్తున్నాడు.
ఒకవేళ ఈ సినిమాని కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిస్తే ఆయన ఎప్పుడు ఇలాంటి కంటే సినిమాలే చేస్తాడు అంటూ ఈసారి ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆయన ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఆయన కూడా ఆయన రూట్ ని మార్చుకొని డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకొని చేస్తే బాగుంటుంది అని మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తారు.
నిజానికి ఇద్దరు దర్శకులు కూడా తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్లుగా వెలుగుందారు. కాబట్టి రాబోయే సినిమాల్లో వైవిధ్యం చూపించకపోతే అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇంకొంత మంది వీళ్ళ మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు.
Also Read : మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తున్న స్టార్ డైరెక్టర్లు…కారణం ఏంటి..?