స్టార్ డైరెక్టర్.. ‘అల్లు అరవింద్’నే మోసం చేశాడు !

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ల్లో.. ‘గీత ఆర్ట్స్’ ఒకటి. పైగా అల్లు అరవింద్ నిర్మాత కాబట్టి.. లెక్కలు, సినిమాల అగ్రిమెంట్లు పక్కాగా ఉంటాయి. ఆ మాటకొస్తే ఈ సంస్థలో సినిమా ఫైనల్ అయిన వెంటనే.. దర్శకుడితో పాటు ఆ సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన రెమ్యునరేషన్ ఫైల్ ను కూడా ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసి.. ఫలానా ఎమౌంట్ ఇస్తాం మీకు అంగీకారమేనా అంటూ సినిమాకి పని చేస్తోన్న ప్రతి […]

Written By: admin, Updated On : April 7, 2021 11:11 am
Follow us on


తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ల్లో.. ‘గీత ఆర్ట్స్’ ఒకటి. పైగా అల్లు అరవింద్ నిర్మాత కాబట్టి.. లెక్కలు, సినిమాల అగ్రిమెంట్లు పక్కాగా ఉంటాయి. ఆ మాటకొస్తే ఈ సంస్థలో సినిమా ఫైనల్ అయిన వెంటనే.. దర్శకుడితో పాటు ఆ సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన రెమ్యునరేషన్ ఫైల్ ను కూడా ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసి.. ఫలానా ఎమౌంట్ ఇస్తాం మీకు అంగీకారమేనా అంటూ సినిమాకి పని చేస్తోన్న ప్రతి వ్యక్తిని అడుగుతారు. అంతలా నిర్మాణం చేస్తారు కాబట్టే ఈ సంస్థలో ఎలాంటి లొసుగులు ఉండవు.

పైగా డబ్బుని ఎక్కడా వృధా చేయకుండా హీరో స్థాయిని బట్టి, సినిమా మార్కెట్ ను బట్టి, ఏ సినిమాకి ఎంత పెట్టాలి, ఎవరికీ ఎంత ఇవ్వాలి అనే విషయంలోనూ చాలా పగడ్బందీగా ఉంటుంది గీత ఆర్ట్స్. కానీ ఏం లాభం ? ఈ సంస్థను ఓ డైరెక్టర్ డైరెక్ట్ గానే మోసం చేశాడు. ఈ సంస్థతో రెండు వెబ్ సిరీస్ లు నిర్మిస్తాను అంటూ ఎనిమిది కోట్లకు బేరం మాట్లాడుకున్న ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఒక చిన్నపాటి వెబ్ సిరీస్ ను నిర్మించి.. ఐదు కోట్లు తీసుకున్నాడు. పైగా చేసిన వెబ్ సిరీస్ లో కూడా చిన్నాచితకా నటీనటులను పెట్టాడు, వారికి ఎలాగూ పెద్దగా రెమ్యునరేషన్స్ కూడా ఉండవు.

ఇక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి వ్యవహారాలకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. కనిపించిన లొకేషన్స్ లో, దొరికిన ఆర్టిస్ట్ లతో వెబ్ సిరీస్ ను చుట్టేసి.. తీసుకున్న ఐదు కోట్లకు బడ్జెట్ వేసేసి.. పక్కా లెక్కలు అంటూ డైరెక్ట్ గా అల్లు అరవింద్ దగ్గరకే ఆ ఫైల్ ను పంపి.. రెండో వెబ్ సిరీస్ చేయాలంటే మరో నాలుగు కోట్లు కావాలి అంటూ రిక్వెస్ట్ చేసాడట. ఆ సదురు ఫేమస్ డైరెక్టర్ చేసిన మోసం దెబ్బకు అల్లు అరవిందే షాక్ అయ్యాడట.

నిర్మాతగా ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న నన్నే.. వీడు ఇంత తేలిగ్గా మోసం చేస్తే.. ఇక కొత్త నిర్మాతల పరిస్థితి ఏమిటి ? దయచేసి ఆ డైరెక్టర్ దగ్గరకి ఏ నిర్మాత వెళ్లకుండా చూడండయ్యా’ అంటూ మొత్తానికి అల్లు అరవింద్ ఆ క్రియేటివ్ డైరెక్టర్ ను కట్ చేశాడు. ఏది ఏమైనా మోసం చేసిన ఆ డైరెక్టర్ ను మాత్రం గీత ఆర్ట్స్ సైలెంట్ గా వదిలేయడం నిజంగా విశేషమే. ఇలాంటి ఇష్యూస్ వల్ల పరువు పోతుంది తప్ప, పోయిన డబ్బులు రావు అని అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయాడట.