‘వకీల్ సాబ్’లో మెగాహీరో.. అతనేనా?

ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ అభిమానులను వకీల్ సాబ్ మేనియా ఓ రేంజ్ లో ఊపేస్తోంది. మూడేళ్ల త‌ర్వాత త‌మ హీరోను తెర‌పై చూసుకునేందుకు ఫ్యాన్స్ క‌ళ్ల‌లో ఒత్తులేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ల త‌ర్వాత ప‌వ‌న్ సినిమా వ‌స్తుండ‌డంతో.. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రంపై ఆస‌క్తితో ఉన్నారు. దీనికితోడు ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌ అన్ని వ‌ర్గాలనూ ఆక‌ట్టుకుంది. త‌న‌కు మాత్ర‌మే సొంత‌మైన పెర్ఫార్మెన్స్ తో ప‌వ‌ర్ స్టార్ దుమ్ములేప‌గా.. ద‌ర్శ‌కుడు అత్యంత ఆస‌క్తిగా ట్రైల‌ర్ ను […]

Written By: Bhaskar, Updated On : April 7, 2021 11:00 am
Follow us on


ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ అభిమానులను వకీల్ సాబ్ మేనియా ఓ రేంజ్ లో ఊపేస్తోంది. మూడేళ్ల త‌ర్వాత త‌మ హీరోను తెర‌పై చూసుకునేందుకు ఫ్యాన్స్ క‌ళ్ల‌లో ఒత్తులేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ల త‌ర్వాత ప‌వ‌న్ సినిమా వ‌స్తుండ‌డంతో.. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రంపై ఆస‌క్తితో ఉన్నారు.

దీనికితోడు ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌ అన్ని వ‌ర్గాలనూ ఆక‌ట్టుకుంది. త‌న‌కు మాత్ర‌మే సొంత‌మైన పెర్ఫార్మెన్స్ తో ప‌వ‌ర్ స్టార్ దుమ్ములేప‌గా.. ద‌ర్శ‌కుడు అత్యంత ఆస‌క్తిగా ట్రైల‌ర్ ను క‌ట్ చేశాడు. దీంతో.. అప్ప‌టి వ‌ర‌కూ సాధార‌ణంగా ఉన్న వ‌కీల్ సాబ్ ప్ర‌చారం.. ఒక్క ట్రైల‌ర్ తో ఆకాశానికి ఎగిశాయి. దీంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండాపోయింది.

అయితే.. ఇటీవ‌ల ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఓ స‌ర్ ప్రైజింగ్ న్యూస్ అభిమానుల‌ను నిల‌వ‌నీయ‌ట్లేదు. గ‌తంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ థ‌మ‌న్ కూడా సినిమా సెకండ్ హాఫ్ లో బిగ్ స‌ర్ ప్రైజ్ ఉందంటూ చెప్పారు. ఆ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు కూడా స‌ర్ ప్రైజ్ అన్నారు. అదేమంటే.. ఈ సినిమాలో మ‌రో మెగా హీరో క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. దీంతో.. ఎవ‌రై ఉంటార‌నే డిస్క‌ష‌న్లో మునిగిపోయారు ఫ్యాన్స్‌.

లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఆ మెగా హీరో ప‌వ‌ర్ స్టార్ కుమారుడు అఖీరా నంద‌న్ అనే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. అఖీరా ను టాలీవుడ్లో గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని, రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఇలాంటి వార్త‌ల నేప‌థ్యంలో అఖీరా ‘వకీల్ సాబ్’లో కనిపించబోతున్నాడని, తండ్రి సినిమాతోనే అరంగేట్రం చేయబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మ‌రి, ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది తెలియాలంటే ఏప్రిల్ 9 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.