Game Changer : రామ్ చరణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది గేమ్ ఛేంజర్. దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. అనుకోని కారణాలతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. సంక్రాంతికి విడుదల చేస్తే మంచి వసూళ్లు రాబట్ట వచ్చు. ఈ కారణంగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని జనవరి 10కి వాయిదా వేశారు. రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీలో 30 ఇయర్స్ పృథ్వి కూడా ఓ పాత్ర చేస్తున్నారట. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పృథ్వి పాల్గొన్నారు. మీరు గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు కదా.. సినిమా ఎలా ఉంటుంది అని అడగ్గా… ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ కథేమిటో హింట్ ఇచ్చాడు.
గేమ్ ఛేంజర్ మూవీతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు గ్యారంటీ. గేమ్ ఛేంజర్ మూవీ చూశాక… అసలు సమాజంలోని వ్యవస్థలు ఇలా ఉంటాయా? ప్రజలను రాజకీయనాయకులు ఎలా దోచుకుంటున్నారు. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? అనేది తెలుస్తుంది. ఒక సామాజిక కోణంలో సాగుతుంది. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాతో శంకర్, రామ్ చరణ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. పాన్ ఇండియా మూవీ కావడంతో మాకు కూడా మంచి అవకాశం. సూర్య పక్కన నేను నటించాను. ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ ఛేంజర్ మూవీ ఒక అద్భుతం, అన్నారు. పృథ్వి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శంకర్ ప్రతి సినిమాలో సామాజిక సమస్యలను చర్చిస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన రాజకీయ నాయకుల అవినీతి, వ్యవస్థలలోని లోపాలపై అస్త్రాన్ని సంధించారు అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ”నానా హైరానా” సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడారు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొట్టాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2 మంచి విజయాలు నమోదు చేశాయి.