Viral News : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి.. అందులో ఒకటే ఈ కామెడీ వీడియో. కామెడీ అని ఎందుకు అంటున్నామంటే.. ప్రస్తుత సమాజంలో ఎటువంటి పోకడలు ఉన్నాయో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక వ్యక్తిని అకారణంగా ఇబ్బంది పెట్టడం.. అతడిని అనవసరమైన వివాదంలో తల దూర్చేలా చేయడం.. అతని జీవితం బుగ్గిపాలు అవుతుంటే.. ఆ మంటలో చలికాచుకోవడం .. వంటి వాటిని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ముఖ్యంగా ఈ కాలంలో యూట్యూబ్ గొట్టాల మీడియాను నడిబజార్లో నిలబెట్టినంత పని చేశారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ గొట్టాల వాళ్ళు పాత్రికేయులుగా చలామణి అవుతున్నారు. ఒక పార్టీకి భజన చేస్తూ.. ఇతర పార్టీ మీద బురద చల్లుతున్నారు. లేనిపోని విషయాలలో కలగజేసుకొని.. తమంతట తామే తీర్పు ఇచ్చేస్తున్నారు. తాము చెప్పింది మాత్రమే వేదమని.. మిగతా వాళ్ళు చెప్పింది శూన్యమని వివరిస్తున్నారు. అయితే అటువంటి ఘటనలు పెరిగిపోవడంతో.. దానికి సెటైరికల్ గా ఈ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..
ఆ వీడియోలో చూపించినట్టుగా రోడ్డుమీద ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతడి చేతిలో ఒక మైక్ ఉంటుంది. మరో వ్యక్తి ఆ రోడ్డుపై సైకిల్ మీద నడుచుకుంటూ వస్తాడు. చేతిలో మైక్ ఉన్న వ్యక్తి.. అతడిని ఆపుతాడు. “గత రాత్రి ఇక్కడ ఒక ఘోరం జరిగింది మీకు తెలుసా? అది మీరు చూశారా?” అని అడుగుతాడు. దానికి ఆ సైకిల్ మీద ఉన్న వ్యక్తి “నాకేం తెలియదు. నేను ఏమీ చూడలేదని” బదులిస్తాడు. ” నిన్న రాత్రి జరిగిన ఆ భయానక సంఘటనలో మీరు కూడా పాలుపంచుకున్నారట కదా..” అని ఆ యూట్యూబ్ గొట్టం పట్టుకున్న వ్యక్తి అనడంతో.. అది సైకిల్ పట్టుకొని ఉన్న వ్యక్తుల భయాన్ని కలగజేస్తుంది. తనకు ఏ పాపం తెలియదని అంటాడు. తను ఇటు రాలేదని స్పష్టం చేస్తాడు. అయితే ఆ యూట్యూబ్ గొట్టం పట్టుకున్న ఆ వ్యక్తి.. సంచలనం కోసం.. సైకిల్ మీద ఉన్న వ్యక్తిని మరింత వివాదంలో లాగాలని చూస్తాడు. అతడి చొక్కా కాలర్ పైకి ఎత్తి లేపుతాడు. దానిని వేరే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతాడు. ఇదేదో తనకు ఇబ్బంది కలిగించే పరిణామం లాగా ఉందని భావించిన ఆ సైకిల్ మీద ఉన్న వ్యక్తి.. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడ్డానికి ఎంతో సింపుల్ గా ఉన్న ఈ వీడియో.. సమాజంలో నేటి పరిస్థితులకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అంతేకాదు జర్నలిస్టులుగా చలా మణి అవుతున్న సో కాల్డ్ యూట్యూబ్ గొట్టం గాళ్ళకు సరైన సమాధానం చెప్పే విధంగా ఉంది.
— . (@chaitu555_) December 6, 2024