Keerthy Suresh
Keerthy Suresh : నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు అందుకొని పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh). బాలనటిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, ఆ తర్వాత మలయాళం లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు కానీ, తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెని మొదటి సినిమా నుండే ఆదరించారు. ‘నేను శైలజ’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ కి ఈమె పరిచయం అయ్యింది. సాధారణంగా మన ఆడియన్స్ హీరోయిన్లు బొద్దుగా ఉంటే అసలు నచ్చరు. కానీ కీర్తి సురేష్ బుద్దుగా ఉన్నప్పటికీ కూడా మన యూత్ ఆడియన్స్ కి నచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె సన్నగా అయ్యింది. సన్నగా ఉన్నప్పటి కంటే, లావుగా ఉన్నప్పుడే బాగుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఇదంతా పక్కన పెడితే కీర్తి సురేష్ తెలుగు లో ఎంత పాపులర్ అయ్యిందో, తమిళ ఇండస్ట్రీ లో అంతకు మించి ఎక్కువ పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈమె విశాల్(Vishal Reddy) తో కలిసి అప్పట్లో ‘పందెం కోడి 2’ చిత్రం చేసింది. షూటింగ్ సెట్స్ లో ఈమె అందరితో వ్యవహరించే తీరు, మాట్లాడే విధానం, అందరి పట్ల చూపించే ప్రేమ, ఇలాంటి మంచి లక్షణాలన్నీ హీరో విశాల్ కి,అతని తండ్రికి బాగా నచ్చింది. అప్పుడు విశాల్ తండ్రి డైరెక్టర్ లింగు స్వామి తో తన కొడుకు విశాల్ ని పెళ్లి చేసుకుంటారా అని అడిగించాడట. ఒక్కసారిగా లింగు స్వామి అలా అడగగానే కీర్తి సురేష్ షాక్ కి గురై కాస్త ఇబ్బంది పడిందట. ఆ తర్వాత అసలు విషయాన్ని చెప్తూ నేను చిన్నప్పటి నుండి ఆంటోని అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఈ విషయాన్ని తెలుసుకున్న విశాల్ బంగారం లాంటి అమ్మాయిని మిస్ అయ్యాను బ్యాడ్ లక్ అని ఫీల్ అయ్యాడట.
రీసెంట్ గానే కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోని ని పెళ్లాడింది. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి సురేష్ ఎంత సంతోషంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి రోజు నుండి నేటి వరకు ఆమె నాన్ స్టాప్ గా ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూనే ఉంది. ఇంకా ఆమె పెళ్లి రోజు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంది. అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆమె. ఇది ఇలా ఉండగా పెళ్లి తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం ‘బేబీ జాన్'(Baby John). బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.