https://oktelugu.com/

Marco : సెల్ఫీ అడిగితే ఫోన్ లాక్కొని జేబులో వేసుకొని వెళ్లిపోయిన ‘మార్కో’ హీరో..వైరల్ అవుతున్న వీడియో!

Marco : సెలెబ్రిటీలు బయటకి వచ్చినప్పుడు అభిమానులు సెల్ఫీలు అడగడం సర్వసాధారణం. కానీ సెలెబ్రిటీలు కూడా మనుషులే, వాళ్ళేమి దేవుళ్ళు కాదు, వాళ్లకు కూడా కోపం, చిరాకు వంటివి ఉంటాయి.

Written By: , Updated On : February 24, 2025 / 08:25 AM IST
Marco

Marco

Follow us on

Marco : సెలెబ్రిటీలు బయటకి వచ్చినప్పుడు అభిమానులు సెల్ఫీలు అడగడం సర్వసాధారణం. కానీ సెలెబ్రిటీలు కూడా మనుషులే, వాళ్ళేమి దేవుళ్ళు కాదు, వాళ్లకు కూడా కోపం, చిరాకు వంటివి ఉంటాయి. సమయం, సందర్భం చూసి సెల్ఫీలు అడిగితే ఇస్తారు. అలా కాకుండా ఇష్టమొచ్చిన సమయంలో, ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు అడిగితే కోపం తెచ్చుకుంటారు. బాలయ్య అయితే రెండు మూడు సందర్భాల్లో అభిమానుల చెంప పగలగొట్టాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. కేవలం బాలయ్య(Nandamuri Balakrishna) ఒక్కడే కాదు, చాలా మంది హీరోలు/హీరోయిన్లు చిరాకు పడిన సందర్భాలు ఉన్నాయి. తమిళ హీరో అజిత్(Thala Ajith) ఎన్నికల సమయం లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఒక అభిమాని సెల్ఫీ దిగడానికి అజిత్ దగ్గరకు వస్తాడు. అప్పుడు అజిత్ కోపంతో ఆ ఫోన్ ని లాక్కొని తన సెక్యూరిటీ కి ఇచ్చేస్తాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

సరిగ్గా అలాంటి సందర్భమే ‘మార్కో'(Marco Movie) హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) విషయం లో జరిగింది. రీసెంట్ గానే ఈయన పీవీఆర్ మాల్ కి విచ్చేశాడు. అక్కడ సినిమా చూసి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక అభిమాని తన మొబైల్ తీసుకొని, ఉన్ని ముకుందన్ హీరో ముఖం మీదకు సెల్ఫీ కోసం పెట్టాడు. దీంతో చిరాకుపడిన ఉన్ని ముకుందన్ అభిమాని ఫోన్ ని లాక్కొని తన జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అనుకోండి, అది వేరే విషయం. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్ని ముకుందన్ కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యాడు. ఆయన స్థానం లో బాలయ్య ఉండుంటే మొహం పగలగొట్టేవాడు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. మరి కొంతమంది మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా..?, అభిమానుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఉన్ని ముకుందన్ మన టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హీరో గా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో విలన్ గా మన ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత అనుష్క (Anushka Shetty) ‘భాగమతి’ లో పాజిటివ్ రోల్ లో మెప్పించిన ఉన్ని ముకుందన్, సమంత(Samantha Ruth Prabhu) ‘యశోద’ చిత్రంలో మరోసారి నెగటివ్ రోల్ లో కనిపించాడు. గత ఏడాది తమిళం లో విడుదలైన ‘గరుడన్’ చిత్రంలో కూడా ఈయన నెగటివ్ రోల్ లో కనిపించాడు. కానీ గత ఏడాది చివర్లో విడుదలైన ‘మార్కో’ అనే యాక్షన్ చిత్రంలో హీరో గా నటించి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉన్ని ముకుందన్ కి తెచ్చిపెట్టిన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. రాబోయే రోజుల్లో ఈయన పాన్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకడిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.