https://oktelugu.com/

Tollywood: హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న నట వారసులు వీళ్లే…

Tollywood: ఆయన చదువు ముగిసిన వెంటనే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా హీరోల కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నప్పటికీ...

Written By:
  • Gopi
  • , Updated On : June 11, 2024 / 10:20 AM IST

    Star Actors sons getting ready to enter industry

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇద్దరు స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అనే దాని మీదనే ఇప్పుడు చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి. ఇక అందులో పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ చాలా మంది మెగా అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే అకీరా నందన్ తొందర్లోనే తన మొదటి సినిమాతో రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు అకిరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్ళాడు. ఇక ఆయన్ని చూసిన మెగా అభిమానులు అకిరా నందన్ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో ఇప్పటికే చాలా కామెంట్లైతే చేస్తున్నారు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 కు పోటీగా వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…ఇలా చేస్తే ఎవరికి నష్టం..?

    ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే దానిమీద పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన వన్ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర పోషించిన గౌతమ్ కృష్ణ ఆ సినిమాలో సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ చదువుకుంటున్నాడు.

    Also Read: Tejaswini: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చిన్న కూతురు… మోక్షజ్ఞ కోసం చూస్తుంటే ఇదేం ట్విస్ట్!

    ఇక ఆయన చదువు ముగిసిన వెంటనే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా హీరోల కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నప్పటికీ అకీరా నందన్, గౌతమ్ కృష్ణ ల ఎంట్రీ పైనే తెలుగు సినిమా అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…ఇక వీళ్ళు కూడా వాళ్ల ఫాదర్స్ లానే సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు…