Rajamouli Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… పాన్ ఇండియాలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఎలాగైనా సరే పాన్ వరల్డ్ లో తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలతో ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు. మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి ఎదుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… అయితే రాజమౌళి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని శరవేగంగా పూర్తి చేశాడు. ఇక మూడో షెడ్యూల్ కోసం కెన్యాకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ అక్కడ పరిస్థితులు బాలేకపోవడం వల్ల కెన్యా షెడ్యూల్ అయితే క్యాన్సల్ అయింది. దాంతో రాజమౌళికి ఇప్పుడు కొంతవరకు టైం అయితే దొరికిందట. ఇక ఈ సినిమాలో విజయేంద్ర ప్రసాద్ రాసిన కొన్ని సీన్స్ రాజమౌళికి పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదట దాంతో ఆ సీన్స్ ను రీ రైట్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: డ్యాన్స్ లో దుమ్ము లేపేసిన ఎన్టీఆర్,హృతిక్ రోషన్..ప్రోమో అదిరింది!
ఇప్పటికే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న దేవకట్టా తో కలిసి కథలోని కొన్ని సీన్లను డైలాగులను చేంజ్ చేసే ప్రయత్నంలో ఉన్నా. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ అవుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
పాన్ వరల్డ్ లో తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటే మాత్రం జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకులు సైతం ఆయన ముందు దిగదుడుపు గానే మిగిలిపోతారు…అలాంటి వాళ్లకు పోటీని ఇస్తూ ఇండస్ట్రీని వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడుగా రాజమౌళి ఘన కీర్తిని సంపాదించుకుంటాడు…
Also Read: కొడుకు హృతిక్ రోషన్ ని దాటేసిన తండ్రి రాకేష్ రోషన్..అదేమీ డ్యాన్స్ సామీ!
మరి ఈ సినిమాలో ఆయన ఎంచుకున్న పాయింట్ చాలా ఫ్రెష్ గా ఉండబోతుందట… ఒక నిధి కోసం ఈ సినిమా మొత్తం సాగబోతోంది. యాక్షన్ అండ్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తోంది. తద్వారా ఈ సినిమాతో తనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…