Na Anveshana Instagram Account Blocked: ఈమధ్య కాలం లో యూట్యూబర్ అన్వేష్(Youtuber Anvesh) పేరు ఏ రేంజ్ లో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఈయన్ని, ఈయన అప్లోడ్ చేసే వరల్డ్ టూర్ వీడియోస్ ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉండేవారు. పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఇతన్ని అనుసరించేవారు. అంతే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల పై ఈయన చేసిన ఉద్యమం కి కూడా మంచి పేరొచ్చింది. ఆ పేరు మొత్తాన్ని తనకు ఉన్న నోటి దూలతో పోగొట్టుకున్నాడు అన్వేష్. ఈమధ్య కాలం లోనే ఆయన సినీ నటుడు శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తుల గురించి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ, అడ్డమైన బూతులు మాట్లాడుతూ, పవిత్రమైన హిందూ దేవుళ్లను కూడా కించపరచడం తో ఒక్కసారిగా ఈయన పై నెటిజెన్స్ తిరుగుబాటు చేశారు.
కొంతమంది ఇతని పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు ఇతని ఇన్ స్టాగ్రామ్ వివరాలను కోరుతూ, హెడ్ ఆఫీస్ కి లెటర్ రాశారు. సోషల్ మీడియాలో కులాలు, మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని, అతన్ని మాకు పట్టించడంలో సహాయం చేయాల్సిందిగా ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ కి లెటర్ పెట్టారు పోలీసులు. అంతే కాకుండా వేలాది మంది నెటిజెన్స్ అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని అతిక్రమించిందని, తక్షణమే ఈ అకౌంట్ ని బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేశారు. అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని పరిశీలించిన ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్, అతన్ని ప్రొఫైల్ ని బ్లాక్ చేసింది. ఇప్పుడు ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదు. ఆ అకౌంట్ కి దాదాపుగా 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు కూడా లేవు.
పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అన్వేష్ యూట్యూబ్ చానెల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ‘నా అన్వేషణ’, ‘ప్రపంచయాత్రికుడు’ అని ఆయనకు రెండు యూట్యూబ్ చానెల్స్ ఉన్నాయి. రెండిటికి కలిపి 40 లక్షలకు పైగా subscribers ఉన్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ అతను చేసిన కామెంట్స్ కారణంగా లక్షలాది మంది ఆయన యూట్యూబ్ చానెల్స్ ని అన్న ఫాలో కొట్టడమే కాకుండా, రిపోర్ట్స్ కూడా కొట్టారు. కాబట్టి త్వరలోనే ఈ రెండు చానెల్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. పాపులారిటీ ఉంది కదా, జనాలు నా వీడియోలను చూస్తున్నారు కదా అని నోటికి ఏది తోచితే అది మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే పరిస్థితులు ఇలా ఉంటాయి. అన్వేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఇండియా కి వస్తే జనాలు రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు.