Allu Arha Manchu Lakshmi Video: సోషల్ మీడియా లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కుమార్తె అల్లు అర్హా(Allu Arha) స్టార్ కిడ్ సెలబ్రిటీ అనేయొచ్చు. ఈమె క్యూట్ వీడియోలు సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్ళ నుండి తిరుగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ కి ఇలాంటి క్యూట్ పాప పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టం అంటూ నెటిజెన్స్ అర్హా వీడియోలు చూసినప్పుడల్లా కామెంట్స్ చేస్తూ ఉంటారు. స్వయంగా అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో అర్హా పాపని ఆటపట్టిస్తూ కొన్ని వీడియోలను షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాయి. ఆ చిన్నారి క్యూట్ నవ్వు, ముద్దులొలికే మాటలు చూస్తే ఎంతటి వాడైనా కరిగిపోవాల్సిందే. రీసెంట్ గా ఆమె మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి(Manchu Lakshmi) తో జరిపిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే పాపం మంచు లక్ష్మి పరువు తీసేసింది అనే చెప్పాలి.
Also Read: కొడుకు హృతిక్ రోషన్ ని దాటేసిన తండ్రి రాకేష్ రోషన్..అదేమీ డ్యాన్స్ సామీ!
తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా అమెరికా లో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతూ ఉంటుంది మంచు లక్ష్మి. ఆమె తెలుగు వ్యాకరణను ఎక్కిరించని వాళ్లంటూ లేరు అనడం లో అతిసయోక్తి లేదు. చివరికి చిన్నారి అర్హా పాప కూడా ఏంటి నీ తెలుగు అని అడిగేసింది. వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే ముందుగా మంచు లక్ష్మి అర్హా తో మాట్లాడుతూ ‘నువ్వు నన్ను ఎదో అడగాలి అన్నావ్ అంట కదా..అది ఏంటి?’ అని అడుగుతుంది. అప్పుడు అర్హా ‘మీకు తెలుగు రాదా?’ అని అడుగుతుంది. నేను తెలుగు అమ్మాయినే పాప, నీకు అంత అనుమానం ఎలా వచ్చింది?, నేను నీతో తెలుగులోనే కదా మాట్లాడాను అని అంటుంది మంచు లక్ష్మి. అప్పుడు పక్కనే ఉన్న అల్లు అర్జున్ ‘కాదు ఎందుకని అలా అడిగావు?’ అని అర్హా ని అడుగుతాడు. ‘మీ ఆక్సెంట్ అలా ఉంది’ అని అంటుంది అర్హా. అప్పుడు మంచు లక్ష్మి నీ యాక్సెంట్ కూడా అలాగే ఉంది కదా అని అంటుంది.
Also Read: డ్యాన్స్ లో దుమ్ము లేపేసిన ఎన్టీఆర్,హృతిక్ రోషన్..ప్రోమో అదిరింది!
అలా ఇద్దరు సరదాగా కాసేపు నవ్వుకుంటూ ఈ సంభాషణ జరిపారు. దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ మేము అడగాల్సిన ప్రశ్న ని నువ్వు అడిగావు, థాంక్యూ అర్హా పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, పుష్ప 2 లాంటి సంచలన విజయం తర్వాత ఆయన ప్రముఖ డైరెక్టర్ అట్లీ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తో అల్లు అర్జున్ ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ కి గురి పెట్టాడు. క్లిక్ అయితే ఇక ఆయన పాన్ వరల్డ్ స్టార్ గా చలామణి అవ్వొచ్చు.
Mee accent ala undi
CUTE ❤️ #Arha #AlluArjun pic.twitter.com/u20uB6DFSJ
— Movies4u Official (@Movies4u_Officl) August 7, 2025