Hrithik Roshan Father Dance: ఇండియా లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మొదటి వరుస లో హృతిక్ రోషన్(Hrithik Roshan) పేరు వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తర్వాత డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తూ వేసే ఏకైక హీరో ఈయన మాత్రమే. అద్భుతమైన గ్రేస్, స్పీడ్, స్టైల్, స్వాగ్ తో ఎంతటి కష్టమైన స్టెప్పుని అయినా చాలా అలవోకగా వేసేస్తుంటాడు హృతిక్ రోషన్. ఆయన పక్కన ఎంత పెద్ద స్టార్ డ్యాన్సర్ అయినా డామినేట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో చితక్కొస్తేస్తాడు. సాధారణంగా ఇలాంటి డ్యాన్స్ ని జీన్స్ ద్వారా పుట్టుకతోనే పొందుతూ ఉంటారు హీరోలు. అందుకు ఉదాహరణ రామ్ చరణ్(Global Star Ram Charan). కానీ హృతిక్ రోషన కి ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన తండ్రి రాకేష్ రోషన్(Rakesh Roshan) క్యారక్టర్ ఆర్టిస్టు మాత్రమే. ఆయన కొన్ని సినిమాలకు దర్శకుడిగా, మరికొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
Also Read: తెలంగాణ పవర్ స్టార్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్న స్టార్ హీరో…
అంత వరకే రాకేష్ రోషన్ గురించి మనకు తెలుసు. కానీ ఆయనలో కూడా ఒక అద్భుతమైన డ్యాన్సర్ ఉన్నాడని నిన్ననే తెలిసిందే. రీసెంట్ గా ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నుండి ‘ఆవన్ జావన్'(Avan Jaavan) పాట విడుదలైంది. ఈ పాటకు సోలో గా రాకేష్ రోషన్ స్టెప్పులు వేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక రీల్ ని అప్లోడ్ చేసాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. హృతిక్ రోషన్ ఈ వీడియో ని చూసి ఎంతో మురిసిపోతూ తన వాల్ మీద షేర్ చేసాడు. రాకేష్ రోషన్ వయస్సు ప్రస్తుతం 75 ఏళ్ళు ఉంటాయి. ఈ వయస్సులో కూడా ఆయన అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం సాధారణమైన విషయం కాదు. సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తున్న ఈ రీల్ ని మీరు కూడా క్రింద చూసేయండి.
Also Read: డ్యాన్స్ లో దుమ్ము లేపేసిన ఎన్టీఆర్,హృతిక్ రోషన్..ప్రోమో అదిరింది!
ఇకపోతే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ బాషాల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ గా ఈ ఆదివారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ మరియు బెనిఫిట్ షోస్ సంస్కృతి ఉంది కాబట్టి, మేకర్స్ ఈ చిత్రాన్ని ఉదయం నాలుగు గంటల నుండి షోస్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి. కానీ యాష్ రాజ్ సంస్థ అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.