War 2 New Promo: హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(Junior NTR) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మరో వారం రోజుల్లో థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. రీసెంట్ గానే విడుదల చేసిన ‘ఆవన్..జావన్’ పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యూట్యూబ్ మరియు ఇతర మ్యూజిక్ మాధ్యమాలలో ఈ పాటనే ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పాట కోసం అభిమానులు ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే విడుదలైన ఈ పాట ప్రోమో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Read Also: తెలంగాణ పవర్ స్టార్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్న స్టార్ హీరో…
‘సలామ్ అనాలి’ అంటూ సాగే పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మ్యాజికల్ మూవ్మెంట్స్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. హిందీ సినిమాలకు సంబంధించిన వీడియో సాంగ్స్ ని సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. కానీ ఈ పాటకు మాత్రం కేవలం ప్రోమో సాంగ్ ని మాత్రమే వదిలారు. పూర్తి పాట థియేటర్స్ లోనే చూడాలి. ఈ పాటలో ఎవరు ఎవరిని డామినేట్ చేసారు అనేది చెప్పడం కాస్త కష్టం. ఎన్టీఆర్ డ్యాన్స్ స్పీడ్ గా ఉంది, హృతిక్ రోషన్ డ్యాన్స్ అద్భుతమైన గ్రేస్ తో ఉంది. కానీ #RRR లోని ‘నాటు నాటు’ పాటలో హీరోల స్టెప్పుల మధ్య ఉండే సింక్ ఇక్కడ మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. రాజమౌళి అంతటి పర్ఫెక్షన్ తో ఏ డైరెక్టర్ కూడా పని చెయ్యలేరు అనడానికి నిదర్శనం ఇదే. అయితే ఈ పాట మాత్రం థియేటర్ లో బ్లాస్టింగ్ అనుభూతిని ఇస్తుందని, అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవుతుందని అంటున్నారు. పాట ట్యూన్ కూడా క్యాచీ గానే ఉంది.
Read Also: పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా..?
చూడాలి మరి ఈ పాట ‘నాటు నాటు’ రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అనేది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి. ఓవర్సీస్ లో హిందీ సినిమాలకు లాంగ్ రన్ లో భారీ వసూళ్లు వస్తుంటాయి కానీ, ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో ఉండవు. ఈ సినిమాకు కూడా అలాగే ఉన్నాయి. కేవలం నార్త్ అమెరికా లో తప్ప, ఎక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాక్టర్ పని చెయ్యలేదు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రొమోషన్స్ లేవని, అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ బాగాలేవని అంటున్నారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ప్రొమోషన్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. కానీ ఎన్టీఆర్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం తో త్వరలోనే హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా వస్తున్నాడు.