SSMB29 Movie Title: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో చాలా మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. బాహుబలి (Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలతో పాన్ ఇండియా ను షేక్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన సినిమా యూనిట్ తొందరలోనే నాలుగో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతోంది అంటూ రాజమౌళి తన సన్నిహితుల దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మహేష్ బాబు లాంటి నటుడు ఈ సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు… అయితే ఈ సినిమా టైటిల్ చాలా క్యాచీగా ఉండాలని అది కూడా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పుడే వాళ్ళు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ‘Gen 62’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని రిజిస్ట్రేషన్ చేయించారట.
Also Read: వార్ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేసిన ఖర్చుతో ఒక సినిమానే తీసేయొచ్చు తెలుసా!
మరి దీనికి గల కారణం ఏంటి Gen 62 అంటే దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? ఒరిజినల్ టైటిల్ గా కూడా ఇదే పెడతారా? లేదంటే మళ్ళీ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో ప్రతి చిన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది.
అందుకే ఆయన టైటిల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చనీయంశంగా మారింది.
Also Read: రవితేజ స్టోరీ సెలెక్షన్ లో మార్పు ఉండదా..?
ఈ సినిమాని 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేసుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చాలా ఫాస్ట్ గా నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రాజమౌళి అటు ప్రొడక్షన్, ఇటు పోస్ట్ ప్రొడక్షన్ రెండు చూసుకుంటూ చాలా బిజీగా ముందుకు సాగుతున్నాడు…