Ravi Teja Story Selection: ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలామంది దర్శకులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. మరి రవితేజ లాంటి నటుడు మాత్రం ఇంకా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను నమ్ముకుంటూ ఉండటం విశేషం… ఇంతకుముందు ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టినప్పటికి ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న రొటీన్ సినిమాలు ఏ మాత్రం సక్సెస్ లను సాధించడం లేదు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ‘భాను భోగవరపు’ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ రవితేజ చేస్తున్న మాస్ జాతర సినిమా టీజర్ ని చూస్తే చాలా రొటీన్ కంటెంట్ తో తరికెక్కినట్టుగా తెలుస్తోంది…మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటు స్టార్ హీరోలు రికార్డులను క్రియేట్ చేస్తు ముందుకు సాగుతున్నారు.
Also Read: త్రివిక్రమ్ ను రిజెక్ట్ చేసి అల్లు అర్జున్ పెద్ద తప్పు చేశాడా..?
కానీ రవితేజ మాత్రం ఇప్పటికీ కమర్షియల్ సినిమాలనే నమ్ముకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ విషయంలో అతని అభిమానులు కొంతవరకు నిరాశ పడుతున్నారనే చెప్పాలి. ఇక ఈ ఏజ్ లో కూడా రవితేజ సోలో హీరోగా రాణిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం ఒక రకంగా మంచిదే…అయితే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలే ఆయన్ని స్టార్ హీరోగా మార్చాయి.
కానీ ఇప్పటికి అవే స్టోరీ లతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆయన ఆ రేంజ్ దాటి పైకి వెళ్లడం లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ‘మాస్ జాతర’ సినిమాని కూడా కమర్షియల్ యాంగిల్ లోనే తెరకెక్కించారు…
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
ఇందులో మాస్ పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, పంచ్ డైలాగులు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. వీటన్నింటిని కలుపుకొని రవితేజ హిట్ కొట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఇంతకుముందు రవితేజ చేసిన సినిమాలన్నీ ఇలాంటి టెంపు లైన్ లోనే తెరకెక్కాయి. అయినప్పటికి ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. మరి మరోసారి రవితేజ అలాంటి కమర్షియల్ సినిమానే నమ్ముకోవడం ఎందుకు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…