SS Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డుని అందుకొని మన తెలుగోడి సత్తా ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి, ఈ సినిమాని అంతర్జాతీయ లెవెల్ లో చిత్రీకరిస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా ప్రముఖ మలయాళం సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని ఒడిశా లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండవ షెడ్యూల్ ని గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో జరుపుతున్నారు.
Also Read : ‘రెట్రో’ దుబాయి ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది..సినిమాలోని హైలైట్స్ ఇవే!
ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మధ్య ఒక పాట చిత్రీకరణ కూడా చేశారట. నేటితో ఈ షెడ్యూల్ పూర్తి అయ్యిందని, రేపటి నుండి మహేష్ బాబు కి నెల రోజుల పాటు వేసవి సెలవులు అని తెలుస్తుంది. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా మహేష్ బాబు వేసవి కాలం లో షూటింగ్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఎండలో కాసేపు నిలబడి షూటింగ్ చేస్తే, మహేష్ చర్మం ఎర్రగా మారిపోతుంది, కళ్ళు తిరిగి కిందపడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయట. అందుకే సమ్మర్ లో షూటింగ్ కార్యక్రమాలు వంటివి పెట్టుకోడానికి అసలు ఆసక్తి చూపించడట మహేష్ బాబు. అందులో భాగంగానే ఆయన సమ్మర్ సెలవులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సెలవులు పూర్తి అయ్యాక విదేశాల్లో షూటింగ్ చేయడానికి మహేష్ పయనం కాబోతున్నాడు. ఆఫ్రికా లోని దట్టమైన అడవుల్లో చాలా వరకు షూటింగ్ చేయబోతున్నాడట.
కేవలం ఈ లొకేషన్స్ ని వెతికి పట్టుకోవడానికే రాజమౌళి ఆరు నెలల సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా సాంగ్ షూటింగ్ అప్డేట్ తెలుసుకున్న అభిమానులు, హాలీవుడ్ యాక్షన్ చిత్రం అన్నారు, హాలీవుడ్ సినిమాలో పాటలేంటి అని రాజమౌళి ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు అభిమానులు. అంతర్జాతీయ సినిమాల్లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటు పాటలు పెడితే అసలు బాగోదని అంటున్నారు. కానీ రాజమౌళి ఏదైనా ఆలోచించే చేస్తాడు. రెగ్యులర్ ఫార్మటు లో అనుసరించే డైరెక్టర్ కాదు ఆయన, ఇతరులకు కూడా తన ఫార్మటు సినిమాలను అలవాటు చేసే ప్రతిభావంతుడు ఆయన, హాలీవుడ్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఇష్టపడకపోతే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వస్తుంది చెప్పండి?, హాలీవుడ్ ఆడియన్స్ కి హాలీవుడ్ మూవీస్ రొటీన్ అయిపోయాయి, కొత్తదనం కోరుకుంటున్నారు, ఆ కొత్తదనమే మన తెలుగు సినిమా, కాబట్టి పాటల కారణంగా సినిమా జానర్ డిస్టర్బ్ అవ్వడం అసాధ్యం అంటూ మరికొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.