Retro : బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేయగల సత్తా ఉన్నప్పటికీ సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య(Suriya Sivakumar). సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఏకైక హీరో ఆయన. అలాంటి హీరో తన రేంజ్ కి తగ్గ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. గత ఏడాది ‘కంగువ’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా మిస్ ఫైర్ అయ్యింది. ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే ఆయన సమాంతరంగా ‘రెట్రో'(Retro Movie) చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలు అవ్వగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన దుబాయ్ ప్రీమియర్ షో టాక్ పూర్తి అయ్యింది. అక్కడి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. టెక్నికల్ పరంగా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి అని అంటున్నారు. కానీ కంటెంట్ మాత్రం ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉందట. ఈమధ్య కాలం లో సూపర్ హిట్ అవుతున్న సినిమాల కంటెంట్స్ వేరే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉన్నా చాలు, బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్నాయి. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో చెప్పొచ్చు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు, థియేట్రికల్ ట్రైలర్, ఇలా ప్రతీ ఒక్క దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘కన్నిమ్మ’ అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈరోజే ఈ సినిమా పై ఇంత హైప్ ఏర్పడిందంటే, అందులో ఈ పాట పాత్ర కచ్చితంగా పెద్దదిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేపు థియేటర్స్ లో ఈ పాటకు ఆడియన్స్ మెంటలెక్కిపోతారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చింది. టాక్ వస్తే మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా అవకాశాలు ఉన్నాయి. మరి అంత దూరం ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి.
Also Read : రెట్రో’ చిత్రాన్ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?