Pawan Kalyan :
పహల్ గాం బాధితులకు సంతాపం తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కదా దేశభక్తి అంటే అనిపించింది. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అనిపించింది. ఒక్కసారి వినండి అందరూ.. ఆవేదన, బాధతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టారు.
సాధారణంగా రాజకీయ నాయకులు ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి జంకుతారు. పేరుకు ప్రాంతీయ పార్టీ.. పేరుకు జాతీయ పార్టీలమని చెప్పుకునేవారికన్నా జాతీయ భావాలతో జనసేన రూపుదిద్దుకుంది. జనసేన ట్రాక్ రికార్డ్ చూస్తేనే అర్థమవుతోంది.
జనసేనాని పవన్ కళ్యాన్ ఇటువంటి సందర్భాల్లో ఆయన మాట్లాడే పద్ధతి.. చేసే పద్ధతి చూస్తే దేశభక్తి ప్రజలు, నాయకులకు ఎంత ఉండాలో స్పష్టమవుతుంది. ఇలాంటి పవన్ లాంటి నాయకులు ఉంటే చాలు దేశమంతా భద్రంగా ఉంటుంది.
జాతీయ పార్టీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది చూస్తే దారుణంగా ఉంది. జమ్మూకశ్మీర్ చీఫ్ లు , రాష్ట్రాల సీఎంలు రాజకీయంగా మాట్లాడడం ఏమాత్రం సహేతుకం కాదు. దేశానికి అవసరమైనప్పుడు వీరు స్పందించిన తీరు ఏమాత్రం బాగా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ భావాల్ని నింపుతున్న పవన్ కళ్యాణ్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
