Victory Venkatesh : ఆధ్యాత్మికతకు బాగా దగ్గర గా ఉండే హీరోలలో ఒకరు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండడం అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆధ్యాత్మికతను తూచా తప్పకుండా అనుసరించే వాళ్లకు తప్ప. ఆ క్యాటగిరీ లో విక్టరీ వెంకటేష్ ఉంటాడు. ఆయన మాట్లాడే ప్రతీ మాట చాలా లోతైన భావాలతో కూడి ఉంటుంది. అసలు ఒక మనిషి ఇలా ఎలా ఆలోచించగలడు, అందరూ ఇలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. రీసెంట్ గానే ఆయన ఒక ఇంటర్వ్యూ లో తన సక్సెస్ ఫార్ములా గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రజినీకాంత్(Superstar Rajinikanth) చెప్పిన ఒక్క సూత్రం పాటించడం వల్లే, తానూ నేడు ఇంత సక్సెస్ ఫుల్ గా నిలిచానని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. అవేంటో ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభం నుండే నాకు రజినీకాంత్ గారితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు ఆయనతో చాలా సినిమాలు చేసాడు. ఒకరోజు రజినీకాంత్ నాతో మాట్లాడుతూ నీ సినిమా విడుదలైన రోజున, నీకు పోస్టర్స్ వేసారా?, కటౌట్స్, బ్యానర్స్ వంటివి కట్టారా?, పోస్టర్ లో నువ్వు సరిగా కనిపిస్తున్నావా లేదా? ఇలాంటి అంశాల గురించి అసలు పట్టించుకోవద్దు. కేవలం నువ్వు చెయ్యాల్సింది ఏమిటంటే, మంచి కథలు ఎంచుకోవడం, మంచి సినిమాలు చేయడం, అవే నిన్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్తాయి అని చెప్పాడు. ఒక విధంగా నేను ఆధ్యాత్మికంగా ఈ స్థాయికి వెళ్ళడానికి రజినీకాంత్ వంటి వారు కూడా ప్రేరణ కలిగించారు’ అంటూ వెంకటేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : శంకర్ పల్లి లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య పాటని చిత్రీకరిస్తున్న రాజమౌళి!
రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్, త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధానికి అవుతున్నారు. ఎప్పుడో ఏడేళ్ల క్రితమే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పుడు కార్య రూపం దాల్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా కోసం పనిచేస్తే చూడాలని సినీ అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్స్ గా నిల్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథ, స్క్రీన్ ప్లే అందించాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం లో వెంకటేష్ చిన్న అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన త్రివిక్రమ్ తో కలిసి పనిచేయబోతున్నాడు.