Homeఎంటర్టైన్మెంట్Rajamouli producing new movie: రాజమౌళి ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడా..?

Rajamouli producing new movie: రాజమౌళి ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడా..?

Rajamouli producing new movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు రాజమౌళి…తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి వెళ్లిపోయింది… ఇక తొందరలోనే ఆయన పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి సైతం ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారణాసి సినిమాలో మహేష్ బాబు ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ తో పాటు తను ప్రొడ్యూసర్ గా కూడా మారాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…

మలయాళం లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఫహద్ ఫజిల్ ను లీడ్ రోడ్ లో పెట్టి ‘ఆక్సిజన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకి అఫీషియల్ గా రాజమౌళి ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటి ఆయన వెనక్కి తగ్గి తన కొడుకు అయిన కార్తికేయ ను ప్రొడ్యూసర్ గా ఎలివేట్ చేస్తున్నాడు.మొత్తానికైతే ఈ సినిమాకి అసలైన ప్రొడ్యూసర్ రాజమౌళి అనే విషయం చాలా మందికి తెలియదు.

Also Read: ‘ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తారా’ సాంగ్ రివ్యూ: పాత సినిమాల్లో మిగిలిపోయిన ట్యూన్ ని దేవిశ్రీ ప్రసాద్ వాడినట్టుంది!

ఇక ఈ సినిమాతో కార్తికేయకు ప్రొడ్యూసర్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి బ్యాక్ సైడ్ ఉండి కార్తికేయ ను ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమాతో కార్తికేయ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఈ సినిమాతో ఆయన టాప్ ప్రొడ్యూసర్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే రాజమౌళి ప్రతి సినిమాలో ‘కార్తీకేయ’ ఏదో ఒక పని అయితే చేస్తుంటాడు.

బాహుబలి సినిమాకి లైవ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించినట్టుగా రాజమౌళి గతంలో తెలియజేశాడు. ఇక ఈ సినిమాతో అతను ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారిపోయి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా తనను టాప్ ప్రొడ్యూసర్ ను చేస్తుందా లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular