https://oktelugu.com/

SS Rajamouli : ఆ యంగ్ హీరోతో SS రాజమౌళి కూతురు డేటింగ్..పూర్తి వివరాలు ఇవే!

SS Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందేలా చేసిన దర్శకుడు రాజమౌళి(SS Rajamouli). నేడు మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్తున్నారంటే అందుకు కారణం రాజమౌళినే.

Written By: , Updated On : March 21, 2025 / 03:42 PM IST
SS Rajamouli

SS Rajamouli

Follow us on

SS Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందేలా చేసిన దర్శకుడు రాజమౌళి(SS Rajamouli). నేడు మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్తున్నారంటే అందుకు కారణం రాజమౌళినే. కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, మనిషిగా కూడా ఆయన ఎంతో మందికి ఆదర్శం. ప్రతీ ఒక్కరిలో సామజిక స్పృహ కలిగించేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే, రాజమౌళి, రమ దంపతులకు పిల్లలు లేరు. ఇప్పుడు మనం చూస్తున్న కార్తికేయ రాజమౌళి కి సొంత కొడుకు కాదు, రమ మొదటి భర్త కొడుకు. అతన్ని తన సొంత కొడుకులాగా రాజమౌళి ఎలా పెంచుకుంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక అద్భుతమైన జీవితాన్ని కూడా అతనికి అందించాడు. అంతే కాకుండా రాజమౌళి మయూఖ(SS Mayookha) అనే అమ్మాయిని దత్తత తీసుకొని ఎంతో అపూరపంగా గా పెంచుతున్నాడు.

Also Read : ఆ ఒక్కటి రాజమౌళి ఒక్కడికే ఎందుకు సాధ్యం అవుతుంది… మిగతా దర్శకులు ఎందుకు చేయలేకపోతున్నారు..?

మయూఖ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవలే రాజమౌళి మీడియా తో పంచుకున్నాడు. తన కూతురు మయూఖ ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) కి వీరాభిమాని. అతన్ని ఒకసారి కలవాలని అనుకుంది. సిద్ధార్థ్ సమయం చూసుకొని లంచ్ డేటింగ్ కి తన ఇంటికి పిలిచాడు. మయూఖ ని అత్యంత అతిధి మర్యాదలతో లోపలకు పిలిచాడు. ఆమెతో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఎన్నో గొప్ప సలహాలు కూడా ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. మయూఖ ఇంటికి వచ్చిన తర్వాత సిద్దార్థ్ తో గడిపిన ఆ క్షణాల గురించి చెప్పుకుంటూ ఎంతో సంతోషించింది. తనని కలిసి, ఇంతటి గొప్ప జ్ఞాపకాలను ఇచ్చినందుకు సిద్దార్థ్ కి ధన్యవాదాలు. మీరు ఇచ్చిన సలహాలు మా అమ్మాయి జీవితానికి ఎంతో ఉపయోగపడుతాయి అంటూ చెప్పుకొచ్చినట్టు రాజమౌళి చెప్పాడు. అప్పట్లో ఆయన ఈ విషయాన్ని ట్వీట్ వేయగా, అది బాగా వైరల్ అయ్యింది.

ఈ ట్వీట్ కి సిద్దార్థ్ మల్హోత్రా స్పందిస్తూ ‘రాజమౌళి గారు..నేను మీకు పెద్ద అభిమానిని. నాకు మీరు అసలు కృతఙ్ఞతలు చెప్పనక్కర్లేదు. మీ అమ్మాయి చాలా మంచిది. అసలు ఆమెకు ఒక టాప్ ఇండియన్ డైరెక్టర్ కి కూతురు అనే గర్వం ఇసుమంత కూడా లేదు. చాలా సింపుల్ గా ఉన్నారు. త్వరలోనే మిమ్మల్ని కూడా కలుసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒడిశా లో షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా మొదలు కాబోతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

Also Read : రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ పై కుట్రలు..ఏకంగా 700 కోట్ల ఖర్చు..తమిళ డైరెక్టర్ పై మండిపడుతున్న నెటిజెన్స్!