Rajamouli
SS Rajamouli : తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి(Rajamouli) మొదటి స్థానంలో ఉంటాడు. బాహుబలి (Bahubali) తో పాన్ ఇండియా సినిమాను చేసిన ఆయన భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో కూడా భారీ రేంజ్ లో సక్సెస్ ను సాధించి ఆయన ఇమేజ్ ను రెట్టింపు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించాయి. 12 సినిమాలు చేస్తే అందులో 12 సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సినిమాతో సక్సెస్ ని సాధించడమే కష్టమవుతున్న రోజుల్లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ లని సాధించడం అంటే అంత ఆశామాషి వ్యవహారమైతే కాదు.
మరి మిగతా దర్శకులు ఎందుకు ఇలాంటి సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. రాజమౌళి ఒక్కడే ఎందుకు ఇలాంటి సక్సెస్ ను సాధిస్తున్నాడనే విషయంలో ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇలాంటి దర్శకుడి సినిమాలో భారీ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకుంటాడు. సినిమా మీద తన ప్రాణం పెట్టి మరి వర్క్ చేస్తాడు. అలాగే సగటు ప్రేక్షకులు ఏమైతే ఆశిస్తున్నారో వాటిని సినిమాల్లో పొందుపరుస్తాడు.
దానివల్లే ఆయన సినిమాలు భారీ విజయాలను సాధించడమే కాకుండా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ ధృడ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక మీదట కూడా ఆయన స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ప్రపంచంలో దిగ్గజ దర్శకులుగా గుర్తింపును సంపాదించుకున్న వారి పక్కన రాజమౌళి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది… మహేష్ బాబు కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాతో డైరెక్ట్ గా వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి