Salaar
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టిన చిత్రం ‘సలార్'(Salaar Movie). బాహుబలి సిరీస్ తర్వాత సరైన కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ని యాక్షన్ హీరో గా మరో లెవెల్ కి తీసుకెళ్లి పెట్టిన చిత్రమిది. కమర్షియల్ గా ఈ చిత్రం ఆరోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టకపోతే ట్రేడ్ వర్గాలు కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనే రోజులు ఇవి. ఆ స్థాయిలో ప్రభాస్ ఎదిగాడు కాబట్టి, 600 కోట్ల గ్రాస్ ఆయన రేంజ్ కి తక్కువే అవ్వొచ్చు. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ బోర్ కొట్టినప్పుడల్లా నెట్ ఫ్లిక్స్ ని ఓపెన్ చేసి సలార్ చిత్రాన్ని చూసేవారు.
Also Read : సలార్ 2 లో పృధ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ చనిపోతుందా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
అలా యూత్ లో కల్ట్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ చిత్రం నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు పూర్తి అయ్యే సరికి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆల్ టైం రికార్డు గ్రాస్ కాకపోయినప్పటికీ, రీ రిలీజ్ చిత్రాలలో మంచి గ్రాస్ ని రాబట్టిన సినిమా అనే అనొచ్చు. ఇకపోతే థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వాటిల్లో ఒక వీడియో అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
విజయవాడ లోని శైలజ థియేటర్ లో నేడు సలార్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) మూవీ గ్లిమ్స్ వీడియో ని ప్రదర్శించారు. ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ సినిమా ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ వీడియో కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఏమిటి?, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం అంతలా ఎదురు చూస్తున్నారా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. వారం రోజుల క్రితమే మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు రీ రిలీజ్ కూడా ఇదే థియేటర్ లో జరగగా, ఇంటర్వెల్ లో ఓజీ టీజర్ ని వేసినప్పుడు ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేది స్ఫష్టంగా అర్థం అవుతుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
#TheyCallHimOG ( #HungryCheetah ) GLIMPSE WAS PLAYED IN SAILAJA , VIJAYAWADA DURING #SalaarReRelease pic.twitter.com/Kdm5JuO0gW
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) March 21, 2025